నూతన విగ్రహాల ఆవిష్కరణ

0
126

నూతన విగ్రహాల ఆవిష్కరణ

జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం మాగల్లు గ్రామం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహాలను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు  సామినేని ఉదయభాను

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ భారతదేశ ఉన్నతికి భారత రాజ్యాంగం రూపొందించబడిందని,దేశాన్ని ప్రజాస్వామ్య,లౌకిక, గణతంత్ర రాజ్యం గా నిర్మించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠిక రూపకల్పన జరిగిందని అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు బడుగు, బలహీన ,వెనుకబడిన,దళిత ,పీడిత వర్గాలకు సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు,అదేవిధంగా దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ చెదరిపోని గుండె బలం నాయకత్వానికి నిలువెత్తు రూపం మన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య,విద్య,108,104 ఆరోగ్యశ్రీ ఎన్నో అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు విధానాన్ని తీసుకోవచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని అన్నారు,ఈ కార్యక్రమంలో KDCC బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్,గ్రామ సర్పంచ్ లు గుంటి ఆశాజ్యోతి,మేడా కోటేశ్వరరావు పోలుబోయిన వెంకటనారాయణ,కొర్రపాటి అచ్చారావు,పీఏసీఎస్ ఛైర్మన్ లు లగడపాటి వీరయ్య, కొల్లూరు ఉమామహేశ్వరరావు,దాములూరు ఎంపీటీసీ నల్లపు సునీత,నాయకులు దేవినేని రామారావు,తోట నరేష్,చెరుకూరి రమేష్,కొలకలూరి వెంకటేశ్వరరావు, కనగాల వెంకటేశ్వరరావు,దేవినేని నాగేశ్వరరావు, చావా సురేష్,యేరువ వీరాంజనేయులు,దాసరి మధు, మొండితోక జయాకర్,మరియు సోషల్ మీడియా సైనికులు,అంబేద్కర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.reporter:santosh..jaggayya pet