నీ కోసం జీవిస్తే – నీలోనే జీవిస్తావు. జనం కోసం – జీవిస్తే జనం లో ఉంటావు-ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు బొర్రా కిరణ్.

0
547

నీ కోసం జీవిస్తే – నీలోనే జీవిస్తావు. జనం కోసం – జీవిస్తే జనం లో ఉంటావు.

వినయం, శీలం లేని విద్యావంతుడు – మృగం కంటే ప్రమాదకరం.”డా బి ర్ అంబేద్కర్”

ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు బొర్రా కిరణ్.

ఎన్టీఆర్ జిల్లా వార్తలోకం ఏప్రిల్ 14:- “కొండపల్లి లోనీ కాంగ్రెస్స్ పార్టీ కార్యాలయం లో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొర్రా కిరణ్ “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్” 132 వ జయంతి సందర్భంగా” చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొర్రా కిరణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి గాంచిన మహామేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బొర్రా కిరణ్ కొనియాడారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు గా అంబేద్కర్ శ్రమ వహించి, అయన మేధా శక్తితో “రాజ్యాంగం రచించటం” ఆయన జీవితంలో ప్రముఖమైన ఘట్టం అని అన్నారు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా పని చేసారని, అంబేద్కర్ తన నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరిపోసింది. భారతదేశపు ఆరుగురు మేధావులలో వారు ఒకరు అని ప్రశంసించాడు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల మరియు వెనుకబడిన, పీడిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా డా”బిఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. అయన రచించిన రాజ్యాంగం ద్వారే ఈ రోజు మన దేశం లో ప్రతి ఒక సామాన్యపౌరుడు గ్రామ పంచాయతీ మెంబెర్ దగ్గర నుండి దేశ ప్రధాన మంత్రిగా మరియు రాష్ట్రపతి వరకూ అత్యున్నతమైన మైన పదవులలో వుంటన్నారంటే అది ఆయన పెట్టిన బిక్షే అని ప్రతిఒక్కరు ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశానికి ఎనలేని సేవలందించారని అంబేద్కర్ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగాపనిచేయడమే ఆయనకు మనము ఇచ్చే ఘన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ కార్యదరిశి పోతురాజు ఏసు దాస్, మాజీ పంచాయతీ మెంబర్లు అక్కల ప్రసాద్, చెరుకు ఆనందరావు, రాగాల రాము, పోతురాజు థామస్ పాల్, మంగళంపాటి లింగరాజు తదితరులు పాల్గొన్నారు.