సామాజిక విప్లవ సారథి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

0
517

సామాజిక విప్లవ సారథి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు.

వార్తలోకం మైలవరం నియోజకవర్గం ఏప్రిల్ 14:- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక విప్లవ సారథి అని, మన దేశ ఔన్నత్యం కోసం ఆయన శ్రమించిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని భీమరాజు గుట్ట శక్తి నగర్ ఏరియాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి, దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా జాతి కోసం, జాతీయత కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, అలుపెరగని పోరాటంతో, స్థిరమైన సంకల్పంతో మన దేశానికి దిశ నిర్దేశం చేసిన ధీశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.