అడ్వకేట్ జనరల్ కి న్యాయవాది డిఎల్ పాండు సన్మానం

0
130

వార్తాలోకం ప్రతినిధి- హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎ సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ హైకోర్టులోని అడ్వకేట్ జనరల్ చాంబర్ లో సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రభుత్వ కార్మిక ఉపాధి కల్పన శాఖ న్యాయవాది డీ ఎల్ పాండు మర్యాదపూర్వకంగా కలిశారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డిని శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ప్రభుత్వ న్యాయవాది డిఎల్ పాండు సన్మానించారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చివరి అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి పని చేసిన సమయంలో సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది డిఎల్ పాండు మత్స్యశాఖ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా సుదర్శన్ రెడ్డి పనిచేసిన సమయంలో డిఎల్ పాండు సంయుక్త కార్యదర్శి సంఘంలో బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డిఎల్ పాండు పనిచేశారు. మాజీ మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం లో ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా ప్రస్తుతం కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా డిఎల్ పాండు పనిచేస్తున్నారు. కొల్లాపూర్ నియోజక వర్గం పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది డిఎల్ పాండు అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయవాదిగా, హైకోర్టులో ప్రభుత్వం తరఫున కార్మిక ఉపాధి కల్పన శాఖ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.