తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు: మంత్రి ఎర్రబెల్లి

0
1096

వార్తాలోకం, వరంగల్ జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలసిస్‌ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు, గుడిబండ తండాల గ్రామాల కొత్త పెన్షన్‌దారులకు ఆసరా కార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. పెన్షన్ల వయో పరిమితిని 57 ఏండ్ల కు తగ్గించామన్నారు.

ఇవి కూడా చదవండి..

శివనాగేశ్వర్ రావుకు మార్గదర్శి అవార్డు

ఇలా చేస్తే రన్నింగ్‌, షాట్‌పుట్‌, లాంగ్‌ జంప్‌ వంటి ఈవెంట్స్‌లో సక్సెస్‌ మీదే