రాజ్యాంగ ఫలాలు అందరూ పొందాలి

0
445

రాజ్యాంగ ఫలాలు అందరూ పొందాలి

ఇబ్రహీంపట్నం సీఐ పి. శ్రీను

వార్తాలోకం ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 14:- రాజ్యాంగ ఫలాలు అందరూ పొందినప్పుడే అంబేద్కర్ కీ మనమిచ్చే నిజమైనా నివాళి అని ఇబ్రహీంపట్నం సీఐ పి. శ్రీను అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలంలోనీ జూపూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ నినాదం ఒక్కటే చదవండి, సంఘటితమవండి, ఉద్యమించండనీ పిలుపు నిచ్చారు. భారతీయుల్ని విద్యావంతుల్ని చేయడానికి ఆయన కళాశాలల్లో పాఠాలు బోధించారనీ గుర్తు చేశారు. చదువు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలనీ కోరారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. రాజ్యాంగం రాసే మొదటిలో ఆయన ఫై ఎంతో మంది విమర్శలు చేశారని, కాలానుగుణంగా ఆయన గొప్ప తనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారని స్పష్టం చేశారు. సమాజంలో వెనుకబడిన వారిని సంఘటితం చెయ్యడానికి ఆయన ఒక రచయితగా, ప్రచురణకర్తగా, శ్రామిక నాయకుడిగా మారారనీ తెలిపారు. నిమ్న కులస్థులకు ప్రత్యేక రాజకీయ హక్కులు ఉండాలని, సామాజిక సంస్కరణలు చేపట్టాలని కోరారన్నారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని సాగించిన పోరాటం వల్ల ఆయనకు విభిన్న మత విశ్వాసాలతో పరిచయం ఏర్పడిందన్నారు. బుద్ధుడి బోధనలకు ప్రభావితుడైన అంబేడ్కర్‌ వైయక్తిక సాధన, సామాజిక సేవలతో సంఘ సంస్కరణలు తేవడానికి బౌద్ధం ఒక గొప్ప సాధనం అని భావించారనీ గుర్తు చేశారు. సామాజిక మార్పును సాధించడం ఎలాగో తెలుసుకోడానికి ఆయన జీవితమే ఒక పాఠశాల. ఆయన జీవితం నుంచి, సంకల్పం నుంచి ప్రపంచ సమాజం నేర్చుకోవలసింది ఎంతో ఉందనీ గుర్తు చేశారు. భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ భారతదేశంలో దళిత నిమ్నకులం నుంచి పైకి ఎదిగారనీ వివరించారు. ఈ కార్యక్రమంలో జూపూడి సర్పంచ్ కె. దేవమాత, వైస్ ఎంపీపీ బాల నాగమ్మ, వైసీపీ మండల కన్వినర్ బి. సాంబశివరావు, కార్యదర్శి మున్నేశ్వరావు, గ్రామ అంబేద్కర్ యూత్ మెంబర్స్ జె. గోపాలరావు, కె. చంటిబాబు, కె. దేవేంద్రరావు, కె. సురేష్, కామేశ్వరరావు, బి. విజయ్, బి. నాగరాజు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

repoprter :vamsi ….Ibrahimpatnam