ఏళ్ళ నాటి కల…తీరిందిలా…!

0
487


న్యూ అయ్యప్ప నగర్ వాసులకు తీరిన కష్టాలు.

జగనన్న కాలనీకి విద్యుత్ సౌకర్యం.

వార్తాలోకం, మైలవరం: ఎట్టకేలకు ఏళ్ల నాటి సమస్యకు మోక్షం కలిగింది. ఈ సమస్యపై మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రత్యేక చొరవ చూపారు. దీంతో న్యూ అయ్యప్ప నగర్ వాసుల కష్టాలు తీరాయి. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైలవరంలో అయ్యప్పనగర్లో పేదలకు ఇళ్లస్థలాలు కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో 10 ఎకరాల భూమిని సేకరించారు. ఆ తర్వాత ఆ భూమిని పేదలకు మాత్రం విడగొట్టి లే అవుట్ గా అభివృద్ధి చేసి పంపిణీ చేయలేదు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు స్థానిక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ భూమిని విడగొట్టి పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేశారు. పక్కాగృహాలు మంజూరు చేయించారు. లే అవుట్ గా అభివృద్ధి చేశారు. గ్రావెల్ రహదారులు ఏర్పాటు చేశారు. తాజాగా విద్యుత్ సౌకర్యం కల్పించారు. వీధిదీపాలు ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాదు శుక్రవారం ప్రారంభించారు. అక్కడ ఇళ్లనిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా పేదలు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిమాన నేత ఎమ్మెల్యే కృష్ణప్రసాదుకు కృతజ్ఞతలు తెలిపారు