ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన శ్రీరాముడుIముగ్ద మనోహర రూపుడు

0
262

శ్రీరాముడు చాలా అందంగా ఉండేవాడని.. అతని రూపం చూస్తే అలా కళ్లప్పగించి చూస్తుండిపోయేవారట. నీలమేఘ శ్యామా నీ రూపం ఎంతసేపు చూసిన తనివి తీరటం లేదయ్యా.. అంటూ పుత్రవాత్సల్యంతో మైమరచిపోయేవాడట దశరధుడు. శ్రీరాముడి ముగ్ధమోహనరూపం గురించి కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. రామాయణం రాసివారు కూడా శ్రీరాముడు సమ్మోహన రూపం గురించి అద్భుతంగా వర్ణించారు. శ్రీరాముడు నవ యవ్వన రూపాన్ని చూసి మైమరిచిపోనివారు లేరంటే అతిశయోక్తి కాదనేలా ఉంది. 21 ఏళ్ల వయసులో రాముడు ఎలా ఉండేవాడో రూపొందించిన చిత్రం చూస్తే. 21 ఏళ్ల వయస్సులో రాముడు ఎలా ఉండేవాడో నవ యవ్వన ముగ్ధమనోహర రూపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపించింది.

చక్రవర్తి కుమారుడే అయినా ఏమాత్రం గర్వమనేది లేక ఒక సాధారణ తండ్రికి కొడుకు ఎలా ఉండాలో.. ఓ అన్నగా, భర్తగా ఇలా ఎన్నో పాత్రల్లా రాముడు ఆదదర్శంగా నిలిచాడు. విలువలతో కూడిన సంపూర్ణమైన జీవితానికి శ్రీరాముడు ఈ సమాజానికి నేటికి ఆదర్శంగా నిలిచాడు. ఒక వ్యక్తి ఎలా ఉండాలో చెప్పడానికి శ్రీరాముడు అనుసరించి ఆచరించిన జీవితమే అందరికీ ఆదర్శనీయం. జగదభిరాముడు, సుగుణాభి రాముడు, నీలమేఘశ్యాముడు, సీతామనోభి రాముడు.. రామయ్యను వారి వారి అభిమానాలను బట్టి పిలుచుకుని మురిసిపోతారు, పరవశించిపోతారు.

వాల్మీకి రామాయణం, రామచరితమానస్‌ తో సహా అన్ని గ్రంథాలలో శ్రీరాముడు ఎలా ఉండేవాడో ఎంత అందంగా ఉండేవాడో వాటిని రచించిన కవుల వర్ణనల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ఈ చిత్రాలను రూపొందించింది. 21 ఏళ్ల వయసులో రాముడు ఎంత ముగ్ధమనోహరమైన రూపంలో ఉన్నారనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన చిత్రం చూస్తే అర్థమవుతుంది. నిజంగా ముగ్ధమనోహరరూపుడే అనిపించేంత అందంగా కళ్లు తిప్పుకోనంత అందమైన రూపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన రెండు శ్రీరాముడి చిత్రాలు, సీతారాముడు చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక ఫొటోలో రాముడు సాధారణంగా ఉండగా, మరో ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. ఇంకో పోటోలో సీతాదేవి సాధారణంగా చూస్తూ కనిపిస్తుంది.

ఈ ఫొటోలపై ఒక యూజర్ స్పందిస్తూ… శ్రీరాముడు అంతటి అందమైన వాడు ఈ లోకంలో మరొకరు పుట్టలేదంటూ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఈ చిత్రాన్ని ఎవరు రూపొందించారనేది మాత్రం తెలియరాలేదు. కానీ, రాముడి చిత్రాలను చూసిన వారంతా తన్మయత్వానికి గురవుతున్నారు. కాషాయరంగు దుస్తులతో రాముడి చిత్రం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.