దాల్మియా అడ్డుకోకుంటే అక్తర్‌ కెరీర్‌ ముగిసేది

0
708

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్‌ దాల్మియా సహాయపడకపోయి ఉంటే  షోయబ్‌ అక్తర్‌ కెరీర్‌ 2000-01లోనే ముగిసిపోయేదని పీసీబీ మాజీ చీఫ్‌ తౌఖీర్‌ జియా వెల్లడించాడు.  1999లో పాక్‌ స్పీడ్‌స్టర్‌ అక్తర్‌ వివాదాస్పద బౌలింగ్‌ శైలిపై విచారణ జరుపుతున్నట్టు పీసీబీకి ఐసీసీ సమాచారమిచ్చింది. ‘అక్తర్‌ బౌలింగ్‌ న్యాయ విరుద్ధమని ఐసీసీ సభ్యులు వాదించినా అప్పటి చైర్మన్‌ హోదాలో దాల్మియా మాకు అండగా నిలిచాడు. అక్తర్‌కు జన్మరీత్యా కుడిచేతి మోచేయి కాస్త పొడుగ్గా ఉంటుంది’ అని జియా తెలిపాడు.