మైరా స్పోర్ట్స్ గోట్స్ ఆధ్వ‌ర్యంలో బాస్కెట్ బాల్ టోర్న‌మెంట్‌ విజేత‌ల‌కు బ‌హుమ‌తుల అంద‌జేత‌

0
634
  • మైరా స్పోర్ట్స్ గోట్స్ ఆధ్వ‌ర్యంలో ఈవెంట్‌
  • చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన హీరో పూరి ఆకాశ్‌
  • విజేత‌ల‌కు బ‌హుమ‌తుల అంద‌జేత‌
  • విజేత‌కు రూ. 50 వేల న‌గ‌దు
  • రాబోయే రోజుల్లో మ‌రిన్ని టోర్న‌మెంట్లు
  • బాస్కెట్ బాల్ క్రీడ‌ని ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్తామ‌న్న ఆర్గ‌నైజ‌ర్ మృదుల‌

వార్తాలోకం ప్ర‌తినిధి, సికింద్రాబాద్‌, మే 20 ః ఈ నెల 19, 20 తేదీల్లో సికింద్రాబాద్ వైఎంసీఏ గ్రౌండ్‌లో బాక్కెట్‌బాల్ టోర్న‌మెంట్ మైరా స్పోర్ట్స్ గోట్స్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈ టోర్న‌మెంట్ లో సుమారు 100 టీమ్‌లు పాల్గొన్నాయ‌ని మైరా స్పోర్ట్స్ గోట్స్ ఆర్గ‌నైజ‌ర్ మృదుల తెలిపారు. చివ‌రిరోజున విజేత‌కు 50 వేల రూపాయ‌ల‌ను న‌గ‌దు బ‌హుమ‌తిగా అంద‌జేశామ‌ని వివ‌రించారు. ఈ ఈవెంట్‌కి ముఖ్యఅతిధిగా హీరో పూరి ఆకాశ్ విచ్చేసిన విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

అనంత‌రం హీరో పూరి ఆకాశ్ మాట్లాడుతూ, మైరా స్పోర్ట్స్‌గోట్స్ వారు మ‌రిన్ని టోర్న‌మెంట్ నిర్వ‌హించాల‌ని సూచించారు. యువ‌త‌లో క్రీడా స్పూర్తిని పెంచాల‌ని, బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ల‌ను మ‌రింత మందిని త‌యారు చేయాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాకుండా విజేత‌ల‌కు త‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

 

అనంత‌రం ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ మృదుల మాట్లాడుతూ మైరా స్పోర్ట్స్ గోట్స్ ద్వారా బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్ల‌ను ప్రోత్స‌హించి, వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ఆర్గ‌నైజేష‌న్ ప‌ని చేస్తోంద‌ని ఆమె తెలిపారు. త‌మ సంస్థ ద్వారా బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వ‌హించ‌డం ఇది రెండవ‌ద‌ని వివ‌రించారు. త‌మ టోర్న‌మెంట్ కి క్రీడాకారుల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింద‌ని ఆమె ఆనందం వ్య‌క్తం చేశారు.

రాబోయే రోజుల్లో మ‌రిన్ని టోర్న‌మెంట్ల‌ను నిర్వ‌హిస్తామ‌ని వివ‌రించారు. అంతేకాకుండా బాస్కెట్ బాల్ క్రీడ‌ను ఐపీఎల్ స్థాయి వ‌ర‌కు తీసుకువెళ్లేందుకు త‌న‌కు దాత‌ల స‌హాయ‌స‌హ‌కారాలు కావాల‌న్నారు. ఈ ఈవెంట్‌ని స‌క్సెస్ చేసిన ప్ర‌తిఒక్క‌రికి పేరుపేరున ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.