గుండెపోటు ఎందుకు వ‌స్తుందో తెలుసా ?

0
217

 

డిజిట‌ల్ యుగంలో అంద‌రికీ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెరిగింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. సామాజిక, ఆర్థిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే… 2020 క‌రోనా తాకిడికి ముందు, 2020 క‌రోనా తాకిడి త‌ర్వాత మ‌నుషుల జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంత‌కు ముందు క‌డుపు నిండిందా? లేదా ? అని చూసేవాళ్లు. అంతే త‌ప్పా, మాన‌వ శ‌రీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటిన్లు, కార్బో హైడ్రెడ్లు అందించాల‌నే ద్యాసే ఉండేది కాదు. కానీ క‌రోనా దాడి త‌ర్వాత ప‌రిస్థితుల‌లో అనూహ్య మార్పులొచ్చాయి. ఈ నేప‌ధ్యంలోనే బాడీని యాంటీ బాడీస్ గా త‌యారు చేయ‌డానికి కావాల్సిన క‌స‌ర‌త్తులు అంద‌రూ చేస్తున్నారు. అయితే, ఈ అవేర్‌నెస్ ప‌ర్సెంటేజ్ త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ క్ర‌మంగా పెరుగుతుండ‌టం శుభ‌ప‌రిణామం.

గుండెపోటు కు కార‌ణాలు ఏమిటీ? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?

2020 క‌రోనా త‌ర్వాత గుండెపోటులు సర్వసాధారణంగా మారిపోయాయి. స్త్రీ, పురుషులు, మ‌ధ్య‌వ‌య‌స్కులు అనే తేడా లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. స‌మ‌యం, సంద‌ర్భంతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు దాడి చేస్తోంది. ఇంత‌కుముందుకు అతిగా బాధించే విష‌యాలు చెవిన ప‌డిన‌ప్పుడు, లేదా క‌ళ్ల‌తో చూసిన‌ప్పుడు గుండెపోటు వ‌స్తుంద‌నేది అంద‌రికీ తెలిసిన, వివిధ మాధ్య‌మాల్లో, సినిమాల‌ల్లో చూపించిన అతి సాధార‌ణ విష‌యం. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎలాంటి బాధ‌, సంతోషక‌ర‌మైన విష‌యాలు, విన‌డం, చూడ‌టం వంటి వాటితో సంబంధం లేకుండా ఈ గుండెపోటు వ‌స్తోంది. ఒక్క గుండెపోటుతోనే మ‌నిషిని చనిపోయేలా చేస్తోంది. అయితే, స్త్రీ, పురుషుల్లో ఈ ఇవి వేర్వేరుగా ఉంటున్నాయి. అందువల్ల గుండెపోటుపై అవగాహన పెంచుకోవడం ఎంతైన అవ‌స‌రం.

మహిళలకు తల తిరుగుడు, మత్తు, వీపు నొప్పి, ఛాతీలో ఒత్తిడి, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఒకటి లేదా రెండు చేతుల్లో నొప్పి, వెన్ను, మెడ, దవడ, లేదా పొట్టలో నొప్పి, స్పృహ కోల్పోవడం, విపరీతమైన నిస్సత్తువ, గుండె పోటులో ఛాతీ నొప్పి సహజం. కానీ మహిళల్లో, ఈ లక్షణం ఉండవచ్చు, ఉండకపోవచ్చు.

అలాగే, పురుషుల్లో చెమటలు పట్టడం, వాంతి, ఛాతిలో ఒత్తిడి, నొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఒకటి లేదా రెండు చేతుల్లో నొప్పి, వెన్ను, మెడ, దవడల్లో లేదా పొట్టలో నొప్పి వంటి లక్షణాలు ఐదు నిమిషాలకు మించి వేధిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. లక్షణాలు కనిపించిన గంటలోగా చికిత్స మొదలుపెడితే మంచి ఫ‌లితం ఉంటుంది. ప్రాణాపాయం నుంచి శాశ్వ‌తంగా త‌ప్పించుకోవ‌చ్చు.

చిన్న వయసులో గుండె పోటు ఎందుకు వ‌స్తోంది ?

2020 త‌ర్వాత యువ హృద‌యాలు గుండెపోటు బారిన‌ప‌డి మ‌ధ్యంత‌రంగా జీవితాలు చ‌లిస్తున్నాయి. ముఖ్యంగా 20-30 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల యువ‌కులు ఎక్కువ‌గా గుండెపోటు బారిన‌ప‌డుతున్నారు. ఇందుకు బాడీని యాంటీ బాడీస్ గా త‌యారు చేయ‌క‌పోవ‌డమే ముఖ్య కార‌ణం. (యాంటీ బాడీస్ అంటే వ్యాధి నిరోధక శక్తి) (ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌). అంటే మన శరీరంలో చొరబడే కరోనా లాంటి వ్యాధులను ఎదుర్కొనే శక్తి మన శరీరం కలిగి వుండటం. దాన్ని పెంచుకోవడం కోసం మనం వ్యాక్సిన్లు వేసుకుంటున్నాం. అసలు వ్యాక్సిన్లు లేకుండానే యాంటీబాడీలను నేచుర‌ల్‌గా బాగా పెంచుకుంటే… అప్పుడు కరోనా వంటి వైర‌స్ సోకినా దానితో శరీరం పోరాడే శ‌క్తిని క‌లిగి ఉంటుంది.

టీనేజ్ వ‌య‌సు వారికే ఎక్కువగా గుండె జ‌బ్బులు…!

అబ్బాయిల‌కు టీనేజ్ వ‌య‌సుకు రాగానే కుటుంబమ‌నే పంజరం నుంచి విముక్తి దొరికి, స్వేచ్చ‌గా విహ‌రించే అవ‌కాశం దొరుకుతోంది. అసలే ఉర‌క‌లు వేసే వ‌య‌సు, ప‌రిగెత్తాలి, ఆకాశంలో విహ‌రించాల‌నేంత కోరిక‌లు, ఏదో చేయాలి, లోకమంతా కొత్త‌గా, వింత‌గా క‌నిపిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో స‌రైన గైడెన్స్ లేక దారిత‌ప్పి, దుర‌ల‌వాట్ల‌కు బానిస‌ల‌వుతున్నారు. ధూమ‌పానం, మద్య‌పానం, రెడీమెడ్ పుడ్ వంటి వాటి వెంట ప‌రిగెత్తి, అమూల్య‌మైన స‌మ‌యాన్ని, జీవితాన్ని అత‌లాకుత‌లం చేసుకుంటున్నారు నేటి యువ‌కులు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్లు లేక‌పోవ‌డం వ‌ల్ల యువ‌కులు త‌ప్పుడుదారిలో ప‌య‌నిస్తున్నారు.

చేయ‌కూడ‌ని ప‌నులు- ప‌ర్య‌వ‌సానాలు

ధూమపానం చేయరాదు. ఇది గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి.

మద్యపానానికి దూరంగా ఉండాలి, చిన్న వయస్సులోనే గుండెపోటుకు ఇది ప్రధాన కారణం.

జంక్ లేదా ఫాస్ట్ ఫుడ్ బరువు పెరగడానికి దారితీసి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఆ స్థితిలో గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఓవర్ టైం వర్క్ మానుకోవాలి. హృదయం అనుమతించినంత మాత్రమే పని చేయాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం కూడా గుండెపోటుకు ఒక కారణం.

ఒత్తిడి శరీరానికి శత్రువు. లోపల టెన్షన్‌ను ఉంచుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

జిమ్‌లో అతిగా లేదా తప్పుడు పద్ధతిలో వ్యాయామం చేయడం, శరీరం పూర్తిగా అలసిపోవడం కూడా గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

సోమరితనం కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

నిద్రా సమయం తగ్గిపోవడం కూడా ఒక కారణం.

నేటి అబ్బాయిలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతూ పొద్దున్నే లేస్తారు.

నేచుర‌ల్ గా యాంటీ బాడీస్ త‌యారు చేసుకోవ‌డం ఎలా ?
కాలానుగుణంగా ఏ సీజ‌న్‌కు ఆ సీజ‌న్‌లో వ‌చ్చే ఫ‌లాలు,( ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించే పండ్లు) ఎండాకాలంలో తాటి ముంజ‌లు, ఆళ్ల నేరేడుపండ్లు, మామిడిపండ్లు, జాన‌పండ్లు వంటివి తీసుకోవాలి. ప్ర‌కృతికి మాన‌వ శ‌రీరానికి ఏ కాలంలో ఏమి అందించాలో బాగా తెలుసు. ఆయా కాలాల‌లో ల‌భించే పండ్ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా త‌గిన మోతాదులో తీసుకుంటే, శ‌రీరంలో యాంటీ బాడీస్ నేచుర‌ల్‌గా త‌యార‌వుతాయి. ముఖ్యంగా ప్ర‌కృతిలో ల‌భించే న‌ల్ల యాల‌క్కాయలు తీసుకుంటే, ఇది అధిక ర‌క్త‌పోటును నియంత్రిస్తుంది. దీని కార‌ణంగా గుండెపోటు లేదా ర‌క్త‌పోటు వంటి స‌మ‌స్య దరిదాపుల‌కు రాదు. ఇవి మ‌న పూర్వీకులు ఆచ‌రించారు. ఫ‌లితంగా సుమారు వంద ఏళ్లకు పైగా ఏ రోగం బారిన ప‌డ‌కుండా బ‌తికి చూపించారు.

– వాకిటి వెంక‌టేశం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌