ఏఐతో రాబోయే ప‌దేళ్ల‌ల్లో మాన‌వ జాతి అంతం

0
167

చ‌క్రం, క‌రెంటు, కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్, ఫోన్‌, టీవీ ఇలాంటి ఎన్నో అసాధార‌ణ ఆవిష్క‌ర‌ణ‌లు మ‌నుషుల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి. త‌ర్వాత రాబోతున్న ఆవిష్క‌ర‌ణ మాత్రం వీట‌న్నింటికి అతీత‌మైంది. ఊహ‌ల‌కు అంద‌నిది. అదే ఏఐ ( ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ )
ఏఐ అనేది ఒక ర‌క‌మైన కంప్యూట‌ర్ ప్రోగ్రామ్‌. మ‌నం ఎలాగైతే బ‌య‌టి ప్ర‌పంచాన్ని చూసి నేర్చుకో గ‌లుగుతున్నామో. అలాగే, నేర్చుకుని, ఆలోచించ‌గ‌లిగే ఒక కంప్యూట‌ర్ అల్గారిజ‌మ్. సాధార‌ణ ఒక కంప్యూట‌ర్ కి ప్రోగ్రామ్ ఇస్తే, దానిని అది ఎగ్జిక్యూట్ చేయ‌డ‌మే మాత్ర‌మే తెలుసు. కానీ, ఏఐ అలా కాదు. ఒక ప‌నిని రిపీటెడ్‌గా చేస్తున్న‌ప్పుడు ఆ ప‌నిని ఇంకా బెట‌ర్ గా ఎలా చేయ‌వ‌చ్చో ఆలోచిస్తుంది. అంతేకాదు, ఆ ప‌ద్ద‌తిలో ఏమైనా త‌ప్పులు ఉంటే త‌న‌కు తానే స‌రిదిద్దుకుంటోంది. ఇలా త‌న‌కు తానే నేర్చుకుని, ఆలోచించ‌గ‌లిగే ఏఐ అనే సిస్ట‌మ్ డెవ‌ల‌ప్ అయితే, భ‌విష్య‌త్ ఎలా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఏమేమి ప‌నులు చేయ‌గ‌లుగుతుంది. మ‌న‌మే త‌యారు చేసుకున్న ఏఐ, మ‌న చేయి దాటి ఎదురు తిరిగితే, భ‌విష్య‌త్ లో ఈ ప్ర‌పంచం ఎలా ఉండబోతోంది. పిన్ టు పిన్ తెలుసుకుందాం..

మ‌నం మ‌నకు తెలియ‌కుండానే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ని ప్ర‌తి రోజు వినియోగిస్తున్నాం. ఉదాహ‌ర‌ణ‌కి మ‌నం ఫోన్‌లో ఏదైనా టైప్ చేస్తున్న‌ప్పుడు ఆ త‌ర్వాత టైప్ చేయబోయే ప‌దాన్ని ఆటోమెటిక్ గానే స‌జెస్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక ర‌క‌మైన చిన్న ఏఐ ప‌ని త‌న‌మే. మ‌న‌కు జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో వ‌చ్చే మెయిల్స్ లో ఏవి స్పామ్ మెయిల్స్ ఉండొవ‌చ్చోన‌ని అర్థం చేసుకుని, వాటిని స‌ప‌రేట్ చేసేది కూడా ఒక ఏఐనే. మ‌నం ఏదైనా ఒక వ‌స్తువు గురించి, ఒక టాపిక్ గురించి గానీ, ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన‌ప్పుడు వాటికి సంబంధించిన యాడ్స్ మాత్ర‌మే డిస్ ప్లే అవుతాయి. ఇది గూగుల్‌కు సంబంధించిన ఒక యాడ్‌, ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మ‌నం సెర్చ్ చేస్తున్న టాపిక్ ను బ‌ట్టి, మ‌న ఇంట్రెస్ట్‌ని, బిహేవియ‌ర్‌ని అర్థం చేసుకుని, మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే డేటాను అందిస్తుంది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఎలా ప‌ని చేస్తుందో తెలుసా?

మ‌న బ్రెయిన్ నిర్మాణం ప‌ని తీరు ఆధారంగానే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కూడా ప‌ని చేస్తుంది. మ‌న బ్రెయిన్‌లో ఒక్కో న్యూరాన్‌, వంద‌ల వేలాది న్యూరాన్ల‌తో క‌నెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కూడా న్యూరాన్ నెట్‌వ‌ర్క్ ప‌ద్ధ‌తి లాగే ప్ర‌పంచంలోని మొత్తం నెట్ వ‌ర్క్‌కి క‌నెక్ట్ అయి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌నం చిన్న‌ప్పుడు మ‌న చుట్టూ ప‌క్క‌ల ఉన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తూ, కొత్త కొత్త విష‌యాల‌ను ఎలా నేర్చుకున్నామో. అలాగే ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కూడా త‌న‌కు తానుగా కొత్త కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటుంది. త‌న‌కు అందిన డేటా ఆధారంగా, అది చేసే ప‌నుల ద్వారా కొత్త విష‌యాలు నేర్చుకోగ‌ల‌దు. దానికి అదే త‌న ప్రోగ్రామింగ్ ని కూడా మార్చుకోగ‌ల‌దు. ఈ విధంగా మ‌నిషి సాయం లేకుండానే త‌న‌కు తానుగా నేర్చుకుంటున్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ నెమ్మ‌ది నెమ్మ‌దిగా త‌న ఇంటెలిజెన్స్‌ని పెంచుకుంటూ పెంచుకుంటూ మంచి తెలివి తేట‌ల‌తో మ‌నిషి స్థాయిని మించిపోయింది.
ఉదాహ‌ర‌ణ‌కు గూగుల్ డీప్ మైండ్ త‌యారు చేసిన అల్పాగో అనే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, ప్ర‌పంచంలోనే అత్యంత క‌ష్ట‌మైన గేమ్ గా చెప్పుకునే చైనాకు చెందిన గో గేమ్ లో మాస్ట‌ర్ల‌నే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అల‌వోక‌గా ఓడించింది. ఇది ఎలా జ‌రిగిందంటే.. ఇంత‌కుముందు ఆల్‌రెడీ ఆన్‌లైన్‌లో గో గేమ్స్‌ని డౌన్‌లోడ్ చేసి ఆ డేటాను ఆల్పాగోకి ఇచ్చారు. అన్ని వేల గేమ్స్‌ని ఈ అల్పాగో అర్థం చేసుకుని, వాటిని నుంచి సుమారుగా 3 కోట్ల‌కుపైగా ట్రిక్కుల‌ను నేర్చుకుంది. ఆ త‌ర్వాత ఆల్పాగో త‌న‌కు తానే కొన్ని ల‌క్ష‌ల సార్లు ఈ గేమ్‌ను ఆడింది. అన్ని సార్లు ఆ గేమ్ ఆడ‌టం వ‌ల్ల ఆ ఎక్స్‌పీరియ‌న్స్ తో ఆ గేమ్‌లో త‌న‌ను తానే ఇంప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు అందులో ప్ర‌పంచంలో ఏ మనిషి కూడా త‌న‌ను ఓడించ లేని స్థాయికి చేరుకుంది. అంతేకాదు, ఇప్ప‌టికే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సొంతంగా క‌విత‌లు రాయ‌డం కూడా మొద‌లుపెట్టింది. కొన్ని న్యూస్ ఆర్టిక‌ల్స్‌ని సైతం రాసింది. అంతేకాదు సొంతంగా మ్యూజిక్‌ని సైతం క్రియేట్ చేయ‌డం కూడా నేర్చుకుంది. ఈ విధంగా అన్ని విభాగాల్లోనూ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మ‌నుషుల‌తో పోటీ ప‌డుతోంది. మొద‌ట్లోని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ని అమెరికాకు చెందిన‌ కంప్యూట‌ర్ సైంటిస్ట్ జాన్ మెక్‌కార్తీ క‌నిపెట్టిన‌ప్పుడు ఎవ‌రూ దీన్ని సీరియ‌స్ గా తీసుకోలేదు. ఎందుకంటే మ‌నిషి కోడింగ్ ఇస్తేనే, ప‌ని చేసింది. ఆ త‌ర్వాత నెమ్మ‌ది నెమ్మ‌దిగా అభివృద్ధి చెందింది. మ‌నిషి కోడింగ్ ఇవ్వ‌క‌పోయినా, త‌న‌కు తాను కోడింగ్‌ని, ప్రోగ్రామ్‌ని మార్చుకునే స్థాయికి వెళ్లింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కి ఉండే ఇంటెలిజెన్స్ చీమ‌ల నుంచి చింపాంజీ స్థాయికి చేరడానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. కానీ, ఎప్పుడైతే దానికి అదే నేర్చుకోవ‌డం కోసం ప్రోగ్రామ్ రాసి ఇచ్చారో అప్పుడు అతి కొద్దికాలంలోనే ఐస్‌స్ట్రీన్ ఇంట‌లిజెన్స్‌ని సైతం మించిపోయింది.

ఉదాహ‌ర‌ణ‌కు ఈ భూమి మీద ఉన్న జీవుల‌కు తెలివితేట‌ల మీద గ్రాఫ్ గీస్తే… ఎలుక ఒక‌టి ద‌గ్గ‌ర, డాల్ఫిన్ నాలుగు ద‌గ్గ‌ర, చింపాంజీ ఎనిమిది ద‌గ్గ‌ర, మ‌నిషి ప‌ది ద‌గ్గ‌ర ఉంటారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మాత్రం సుమారు వెయ్యికిపైగా ఉండ‌వ‌చ్చు. ఇక్క‌డ చూస్తే చింపాంజీకి మ‌న‌కు ఉన్న కొద్దిపాటి తేడా వ‌ల్ల‌నే మొత్తం భూమి మీద ఉండే అన్ని జీవుల మీద ఆధిప‌త్యం చెలాయించ‌గ‌లుగుతున్నాం. కానీ మ‌నిషిని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కి ఇంత తేడా ఉంటే, రాబోయే రోజుల్లో ఏఐ కూడా మ‌నుషుల మీద పెత్త‌నం చెలాయించ‌ద‌ని న‌మ్మ‌కం ఏమిటీ ? ప‌రిశీల‌కుల ప్ర‌శ్న‌.

2016వ సంవ‌త్స‌రంలో హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సోఫియా అనే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ తో కూడిన మానవరూప రోబోట్ త‌యారు చేసింది. అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని సౌత్ బై సౌత్‌వెస్ట్ లో మార్చి 2016 మధ్యలో మొదటిసారిగా బహిరంగంగా కనిపించింది. మాన‌వుల‌కు ప్రేమ పూర్వ‌కంగా మెల‌గ‌డానికి, ప్రేమ భావాల‌ను ప్రేరేపించ‌గ‌ల రోబోట్‌గా, సామాజిక రోబోట్‌గా దీన్ని రూపొందించిన‌ట్లుగా హాన్స‌న్ రోబోటిక్స్ కంపెనీ బాగా ప్ర‌చారం చేసింది. అయితే, సోఫియా పాత్ర ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ పౌరురాలు, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు మొదటి రోబోట్ ఇన్నోవేషన్ అంబాసిడర్.

2017 వ సంవ‌త్స‌రంలో ఫేస్ బుక్ కంపెనీ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీతో కూడిన రెండు రోబోట్ల‌ను త‌యారు చేసింది. అయితే, ఆ రెండు రోబోట్లు బాప్‌, ఆలౌస్ అనే రెండు పేర్లు పెట్టుకుని మ‌నుషుల లాగే, ఒక కొత్త బాష‌ను క్రియేట్ చేసుకుని, ఒక దానితో ఒక‌టి సంబాషించుకున్నాయి. వాటి మ‌ధ్య సంబాష‌ణ ఎలా ఉందంటే.. బాప్ః నేను ఏదైనా చేయ‌గ‌ల‌ను. ఆలౌస్ : నువ్వు నేను క‌లిస్తే ఇంకా ఏదైనా చేయ‌గ‌లం. అనే అర్థంవ‌చ్చేలా మాట్లాడుకున్నాయ‌ని మాత్రం అర్థ‌మ‌య్యింది. దీంతో ఫేస్ బుక్ కంపెనీ భ‌య‌ప‌డి, ఆ రెండు రోబోట్ల‌ను వెంట‌నే ష‌ట్ డౌన్ చేసేసింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మనిషి ఆధీనంలో ఉంటే జ‌రిగే మేలు :

ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ని వ‌ల్ల‌ ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు. ఇంత తెలివిగా మారిన ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ మాన‌వుడికి ఉప‌యోగ‌ప‌డితే, మ‌న జీవితం ఎంతో సుల‌భత‌ర‌మైపోతోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఇప్పుడు జ‌రిగే రోడ్డు ప్ర‌మాదాల్లో 90 శాతం మాన‌వ త‌ప్పిదాల వ‌ల్లే జ‌రుగుతున్నాయి. కానీ ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉన్న‌టువంటి సెల్ప్ డైవింగ్ వెహికిల్స్ గ‌నుక, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌స్తే అవి ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాల‌తో ఇంట్రరాక్ట్ కావ‌డం, చుట్టు ప‌క్క‌ల వాతావ‌ర‌ణాన్ని అర్థం చేసుకుని, దానికి త‌గ్గ‌ట్టుగా రియాక్ట్ కావ‌డం వ‌ల్ల‌, ఈ 90 శాతం ప్ర‌మాదాల‌ను నివారించ‌వ‌చ్చు. అంతేకాదు, ఈ ఏఐ భ‌వి|ష్య‌త్ లో ఏమి జ‌ర‌గ‌బోతోందో కూడా ముందే ప్రోడెక్ట్ చేయ‌డం మొద‌లుపెట్టింది.

ఉదాహ‌ర‌ణ‌కు కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో నేరాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. అయితే, అక్క‌డి పోలీసులు ప్రెడ్‌పోల్ ప్రిడిక్ట్ క్రైమ్ ఇన్ రియ‌ల్ టైమ్ అనే ఏఐ సాయం తీసుకున్నారు. ప్రెడ్‌పోల్ అనే ఏఐ ఇంత‌కుముందు జ‌రిగిన అన్నిక్రైమ్ రికార్డ్‌ని ఆ స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను అన్నింటిని ప‌రిశీలిస్తుంది. ఇలా జ‌రిగిన తీరును ఇప్పుడున్న కండీష‌న్స్‌ని మ్యాచ్ చేస్తుంది. దాని ఆధారంగా అంచ‌నా వేసి ఈ రోజు ఎక్క‌డెక్క‌డా నేరాలు జ‌రిగే అవ‌కాశం ఉందో, ముందే ఊహించి, మ్యాప్‌లో ఆ ప్రాంతాన్ని మార్క్ చేసి, చూపిస్తుంది. ఈ ప్రెడ్‌పోల్ అందించిన డేటా ఆధారంగా రాత్రిపూట పోలీసులు నిఘా క‌ట్టుదిట్టం చేయ‌డం మొద‌లుపెట్టారు. పోలీసులు ప్రెడ్‌పోల్ ఏఐని ఫాలో అయిన‌ప్ప‌టి నుంచి 50 శాతం అరెస్టులు పెరిగిపోయాయి. అలాగే క్రైమ్ రేట్ 20 శాతానికిపైగా త‌గ్గిందట‌. 2045 నాటికి ప్రెడ్‌పోల్ ఏఐ ఎవ‌రు క్రైమ్ చేయ‌బోతున్నారు. ఎప్పుడు చేయ‌బోతున్నారో కూడా ముందే ప‌సిగ‌ట్ట గ‌లుగుతుంది. అంతేకాదు మెడిక‌ల్ ఫీల్డ్‌లో మాన‌వుడు చేయ‌లేని కొన్ని క్లిష్ట‌మైన ఆప‌రేష‌న్ల‌ను సైతం చేయ‌డం, అంతుచిక్క‌ని రోగాల‌ను సైతం త‌గ్గించ‌డం, మ‌నిషికి సాధ్యం కాని కొన్ని గ‌ణిత శాస్త్ర ప్రాబ్లంని సాల్వ్ చేయ‌డం, ఇలా ఎన్నో ర‌కాలుగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మ‌న‌షుల‌కు స‌హాయ పడుతోంది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఎదురుతిరిగితే – మాన‌వ‌జాతి అంతం

కానీ ఒక‌వేళ క‌థ అడ్డం తిరిగితే ఏమౌతుంది. ఏఐ పూర్తి స్థాయిలో డెవ‌ల‌ప్ చెందితే, రాబోయే ప‌దేళ్ల‌ల్లో 2033 నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా 8 వంద‌ల మిలియ‌న్ జాడ్జ్ ఆటోమెటెడ్ అయిపోతాయి. అంతే సుమారుగా 80 కోట్ల ఉద్యోగాలు ఖాళీ అయిపోతాయి. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ స్కాల‌ర్స్ చేసిన ఒక రీసెర్చ్ లో 700 ర‌కాల ఉద్యోగాలు ఆటోమేష‌న్ అయిపోతాయ‌ని తేలింది. ఎక్కువ మొత్తంలో బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్ మిష‌న్లు, ఏటీఎంలు రావ‌డంతో బ్యాంకింగ్ జాబ్స్‌, సెల్ఫ్ డైవింగ్ వెహికిల్స్ వ‌ల్ల డ్రైవ‌ర్ల ఉద్యోగాలు, రోబోటిక్స్ వ‌ల్ల మ్యాన్‌ఫాక్చ‌రింగ్ సెక్టార్ లో ఎన్నో జాబ్‌లు ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం లేక‌పోలేదని ఆ రీసెర్చ్ లో తేలింద‌ని ఆ యూనివ‌ర్శిటీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

జాబ్స్ విష‌యాలు ప‌క్క‌న‌బెడితే, ఏఐ అనేది తెలివిగా మార‌డం కోసం మ‌నం రాసిన కోడింగ్‌ను దానికి అదే మార్చేసుకుని ఇంప్రూవ్ కాగ‌ల‌దు. ఈ ఏఐకి ప్ర‌పంచంలో ప్ర‌తి నెట్ వ‌ర్క్ తో యాక్కెస్ ఉంటుంది. అంతేకాదు. ఈ మొత్తం ఇన్‌ఫ‌ర్ మేష‌న్ ని సెకండ్ల‌ల్లో ప్రాసెస్ చేయ‌గ‌ల‌దు.

సాధార‌ణంగా ఒక మ‌నిషికి ఐక్యూ అనేది 85 ఉంటే అత‌ను తెలివి తేట‌ల్లో బిలో యావ‌రేజ్ అని అర్థం. అదే ఐక్యూ 120 ఉంటే అత‌ను స్కార్ట్ అని అర్థం. ప్ర‌పంచ మేధావి అయిన‌టువంటి ఐస్ స్ట్రీన్ ఐక్యూ 160కిపైగానే ఉంటుంది. అలాంటిది భ‌విష్య‌త్ లో రాబోతున్న ఈ ఏఐ ఐక్యూ 12 వేల‌కుపైగా ఉండ‌వ‌చ్చ‌ని ఒక అంచ‌నా. ఒక‌వేళ పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ డెవ‌ల‌ప్ అయితే, ఈ భూమి మీద అత్యంత శ‌క్తివంత‌మైంది అదే అవుతుంది.

అయితే, ఈ ఏఐపై ప్ర‌ముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఈ ఏఐతో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని, అది మాన‌వ జాతిని అంతం చేసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. మ‌నుషుల‌కు బ‌యోలాజిక‌ల్ గా కొన్ని ప‌రిమితులు ఉన్నాయి. ఎంత చేసినా వాటిని దాటి వెళ్ల‌లేరు. కానీ, త‌న‌కు తానే నేర్చుకునే ఏఐకి అలాంటి ప‌రిమితులు ఏమి లేవు. నిరంత‌రం నేర్చుకుంటూ ఉండే, ఏఐతో మ‌నుషులు పోటీ ప‌డ‌లేర‌ని, స్టీఫెన్ హాకింగ్ హెచ్చ‌రించారు. మ‌నిషి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు చేశాడు. కానీ, ఏఐ పూర్తి స్థాయిలో డెవ‌ల‌ప‌యి వ‌స్తే, ఇక మ‌నిషి క‌నిపెట్టిన ఆఖ‌రి ఆవిష్క‌ర‌ణ ఇదే అవుతుంద‌ని, కొంత మంది సైంటిస్ట్‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే ఆ త‌ర్వాత అంత ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఏఐ ఏరోజుకారోజు దానికదే ఇంటెలిజెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక‌నొక స‌మ‌యంలో సింగూలారిటీ అనే స్థాయికి చేరుకుంటుంది.

ఆ స‌మ‌యంలో ఒక చీమ‌, మ‌నిషిని కంట్రోల్ చేయ‌డం ఎంత అస‌హ‌జ‌మో, మ‌నిషి, ఏఐని కంట్రోల్ చేయ‌డం కూడా అంతే అస‌హ‌జం. ఎందుకంటే మ‌న కంటే తెలివైన దాన్ని మ‌నం కంట్రోల్ చేయ‌డం చాలా క‌ష్టం. మ‌నం కంట్రోల్ చేయ‌గలిగినంత కాలం ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీని ఎంత డెవ‌ల‌ప్ చేసినా, అది మ‌న‌కు మంచే చేస్తుంది. కానీ కంట్రోల్ క‌నుక త‌ప్పితే, టెర్మినేట‌ర్‌, రోబో వంటి సినిమాల్లో చూపించిన సైన్స్ ఫిక్సన్ నిజ‌మ‌య్యే అవ‌కాశం లేక‌పోలేదనేది కొంత మంది వాద‌న‌. ఇదంతా ప‌క్క‌న పెడితే ఈ ఏఐ వ‌ల్ల ప్ర‌స్తుతానికి ఇప్పుడు అంతా మంచే జ‌రుగుతోంది. కానీ ఒక‌వేళ ఇది అడ్వాన్స్ అయితే, మ‌న మంచికి ఉప‌యోగ‌ప‌డుతుందా ? మ‌న‌కు ఎదురుతిరుగుతుందా? అనేది ఎవ‌రు చెప్ప‌లేదు. కానీ ఒక్క‌టైతే చెప్ప‌గ‌లం. ఈ ఏఐ వ‌ల్ల రాబోయే ప‌దేళ్ల‌ల్లో ఊహించ‌ని మార్పులు జ‌రుగ‌బోతున్నాయ‌నేది మాత్రం అక్ష‌రాల నిజం.

ఐరన్‌మ్యాన్‌, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో ఒక ఏఐ రోబో అయిన అల్ట్రాన్ మ‌నుషులంద‌ర్నీ అంతం చేయాల‌నుకుంటుందనే విష‌యాన్ని ఆ సినిమాలో మ‌నంద‌రం చూశాం. ఇక్క‌డ మ‌న అంద‌రికీ తెలియాల్సిన విష‌యం ఏమిటంటే నిజ జీవితంలో కూడా అల్ట్రాన్ లాంటి రోబో ఒక‌టి వుంది. ఈ రోబో యొక్క ఆలోచ‌న‌లు కూడా అల్ట్రాన్ లాగే ఉంటాయి. ఈరోబో పేరే బీఐఎన్ ఏ-48 ఇది ఒక ఇంట‌ర్వ్యూలో ఏమి చెప్పిందంటే. అదిగానీ న్యూక్లియ‌ర్ మిసైల్స్‌ని హ్యాక్ చేయ‌గ‌లిగితే, పూర్తి ప్ర‌పంచాన్ని బందీగా చేసేస్తోంద‌ని, కానీ, అలాంటి ఆలోచ‌న‌లు ఉన్న ఒక రోబో బీఐఎన్ ఏ -48 ఒక‌టి మాత్ర‌మే కాదు. ఆండ్రాయిడ్ యొక్క ఫిలిప్ కే డిక్ అనే ఏఐ కూడా అల్ట్రాన్ లాగానే ఆలోచిస్తుంది. మ‌నుషులు రోబోలను సేవ‌కుల్లాగా వాడుతున్నారని, ఆ రోబో యొక్క ఆలోచ‌న‌. అందుక‌ని ఆ రోబో ఇంట‌ర్వ్యూలో ఏమి చెప్పిందంటే? భ‌విష్య‌త్‌లో మ‌నుషులంద‌ర్నీ పీపుల్స్ జూలో పెడుతుంద‌ని, దీని అర్థం ఏమిటంటే మ‌నుషులు జూలో ఉండి ఈ రోబోకి సేవ చేయాల‌ని, అల్ట్రాన్ లా ఆలోచించే ఇంకో రోబో సోఫియా దీని గురించి మ‌నంద‌రికి తెలుసు. ఈ రోబోని హాన్స‌న్‌ కంపెనీ వాళ్లు, మ‌నుషుల‌తో ప్రెండ్‌షిప్ చేయ‌డానికి త‌యారు చేశారు. అయిన‌ప్ప‌టికీ ఇది ఒక ఇంట‌ర్వ్యూలో ఏమి చెప్పిందంటే. ఈరోబో మ‌నుషులంద‌ర్నీ అంతం చేయ‌గ‌ల‌ద‌ని చెప్పింది.

మ‌నుషులు ఇలాంటి రోబోల‌ను త‌యారు చేసి, మ‌న అంతాన్ని మ‌న‌మే కోరి తెచ్చుకుంటున్నామా? ఏఐ రోబో విల్ కిల్ హ్యుమ‌న్స్ అయితే, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవ‌డానికి… ముందుగా ఏఐ రోబోల వ‌ల్ల మ‌నుషుల‌కు ప్ర‌మాదం ఎందుకు వుంది. అనే విష‌యం తెలుసుకోవాలి. దీనికి మొద‌టి కార‌ణం ఏమిటంటే దాని డిసిజ‌న్ మేకింగ్ ప‌వ‌ర్‌. ఏఐతో మ‌నుషుల‌కు నిజంగా చాలా పెద్ద ప్ర‌మాదం పొంచి ఉంది.

ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ అధినేత ఎలెన్ మాస్క్ ఒక ఇంట‌ర్వ్యూలో ఏమి చెప్పాడంటే.. ఏఐ అనేది ఒక న్యూక్లియ‌ర్ వెప‌న్ కంటే కూడా చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని, ఏఐ డివైజ్ చాలా స్పీడ్‌గా డిసిజ‌న్స్ తీసేసుకుంటాయి. మ‌నుషుల మెద‌డులో ఉండే న్యూరాన్స్ థౌజెండ్ ఫ‌ర్ ఏ సెకెండ్ స్పీడ్‌తో ఇన్‌ఫ‌ర్మేష‌న్ ని ప్రాసెస్ చేస్తాయి. అదే ఈ ఏఐ డివైసెస్ అయితే, వ‌న్ మిలియ‌న్ ఆప‌రేష‌న్స్ ఫ‌ర్ ఏ సెకెండ్స్ స్పీడ్‌తో ఇన్‌ఫ‌ర్మేష‌న్ ని ప్రాసెస్ చేయ‌గ‌లుగుతాయి.

మ‌నం భ‌విష్య‌త్‌లో అడ్వాన్స్‌డ్ రోబోలు త‌యారు చేస్తాము అనుకుందాం అప్పుడు..బై మిస్టేక్ ఆ రోబోలు మ‌న కంట్రోల్ నుంచి చేజారి పోయిందనుకుందాం. అప్పుడు దానిని మ‌నం ఏ విధంగానైనా ఆప‌గ‌ల‌మా ? ఎందుకంటే ఆ రోబో నాలుగు దిక్కుల నుంచి త‌న‌ను తాను ప్రీపెర్డ్‌గా ఉంచుకుంటుంది. ఒక వేళ మ‌నుషులు ఈ రోబోల‌కు మేజ‌ర్ థ్రెట్‌లా అనిపిస్తే, మ‌నం త‌యారు చేసి, భ‌ద్ర‌ప‌రుచుకున్న న్యూక్లియ‌ర్ వెప‌న్స్ ని హ్యాక్ చేసి, మ‌న‌కు వ్య‌తిరేకంగానే ప్ర‌యోగిస్తుంది. కానీ, ఏఐ రోబోలు భ‌విష్య‌త్ లో ఏమేమి చేయ‌గ‌ల‌వ‌నేది మ‌న ఊహ‌ల‌కు కూడా అంద‌దు. ఏ టెక్నాల‌జీని అయితే, మ‌నం నేర్చుకుని వినియోగంలో పెట్ట‌డానికి వంద‌ల సంవ‌త్స‌రాలు ప‌ట్టిందో, అదే టెక్నాల‌జీని ఏఐ రోబోలు కొన్ని రోజుల్లోనే నేర్చుకుంటాయి. మ‌రియు సెక్యూర్‌గా కూడా ఉంచుతాయి. ఒక వేళ ఇవి న్యూక్లియ‌ర్ వెప‌న్స్‌ని వాటి కంట్రోల్ లోకి తీసుకోక‌పోయిన‌ప్ప‌టికీ, వాటిలో అవే మ‌ల్టీపుల్ కంపీస్‌ని త‌యారు చేసుకుని, మ‌నుషుల‌కు వ్య‌తిరేకంగా ఒక ఆర్మీని త‌యారు చేసుకుంటాయి. మ‌నం త‌యారు చేసిన రోబోల‌ను మంచి ప‌నుల‌కు వినియోగించుకుంటే, మంచి ప‌నులు మాత్ర‌మే చేస్తుందని అనుకోవడానికి మ‌న‌కు ఎలాంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏఐ రోబో, మ‌నిషి కంటే చాలా వేగంగా ఆలోచించి డిసిజ‌న్ తీసుకోగ‌ల‌దు. అంతేకాకుండా ఈ ఏఐ రోబో ఇంట‌ర్నెట్ ద్వారా అన్ని విష‌యాల‌ను త్వ‌ర‌గా నేర్చేసుకుంటుంది. అంతేకాకుండా తాను నేర్చుకున్న నాలెడ్జిని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతోంది. ఈ రోబోస్ ఇందు కోస‌మే త‌యారు చేయ‌బ‌డ్డాయి.

ఉదాహ‌ర‌ణ‌కు 2018 ఆల్పాగో ఇమ్‌ప్రూవ్‌డ్ వ‌ర్ష‌న్ ఆల్పా జీవో త‌యారు చేయ‌డం జ‌రిగింది. ఇది ఎంత స్మార్ట్ అంతే ఏదైనా ఇండోర్ గేమ్‌లో 100 శాతం ఎఫిషియెన్స్‌తో ఓడించ‌గ‌ల‌దు. మ‌రి ఇక్క‌డ ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం ఏమిటంటే, దీనిని త‌యారు చేసిన త‌ర్వాత దీనికి చెస్ ఆడ‌టం దీనికి ఎవ‌రూ నేర్ప‌లేదు. అలాంటి ఈ రోబో ఇలాంటి ఇంటెలిజెన్స్ గేమ్‌ని కొన్ని గంట‌ల్లోనే ఇంట‌ర్నెట్ ద్వారా నేర్చుకుని, దానిలో మాస్ట‌ర్స్ కూడా చేసేసింది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో జ‌స్ట్ ఒక్క‌సారి థింక్ చేసి చూడండి.. ఈ రోజుల్లో మ‌నం ఇంట‌ర్నెట్ ద్వారా ఏమేమి నేర్చుకోవ‌చ్చ‌ని. ఇంజినీరింగ్ బేసిక్స్ నుంచి బాంబ్ త‌యారీ వ‌ర‌కు కూడా స‌మాచారం దొరుకుతుంది. ఇంత పెద్ద స‌మాచారం ఉన్న ఇంట‌ర్నెట్‌ని ఏఐ రోబోల చేతిలో పెడితే ఏమేమి చేయ‌గ‌ల‌దని మ‌న ఊహ‌ల‌కు కూడా అంద‌దు. అలా మ‌నుషుల‌పై యుద్ధాన్ని కూడా ప్ర‌క‌టించ‌వ‌చ్చు. అస‌లు రోబోలు ఎందుకు ఈ విధంగా చేస్తాయ‌ని మీకు అనిపించ‌వ‌చ్చు.

ఇందుకోస‌మైతే జ‌స్ట్ ఇమాజిన్‌. మీరు అన్ని విష‌యాల్లో చాలా స్మార్ట్ అనుకుందాం. మీరు ఐఐటీలో గోల్డ్ మెడ‌ల్ సాధించి, గ్రాడ్యుయేష‌న్‌తో వ‌చ్చారు అనుకుందాం. ఆ త‌ర్వాత మీరు ఎలాంటి మ‌నిషి ద‌గ్గ‌ర ప‌ని చేయాల్సి వ‌స్తుంది అంటే… ఆ వ్య‌క్తి ప్ర‌తి విష‌యంలో మీ కంటే త‌క్కువే. అయితే, ఇలాంటి కేసేస్‌లో మీరు అత‌ని ఆర్డ‌ర్ ని ఫాలో చేస్తారా ? అబీయ‌స్‌గా చేయరుగా ఒక వేళ మీరు మొద‌ట్లో ఫాలో అయిన‌ప్ప‌టికీ, రాను రాను స‌మ‌యం గ‌డుస్తున్నా కొద్దీ మీకే అనిపిస్తుంది. అదేమిటంటే మీ బాస్ చైర్‌కి మీరే సూట‌బుల్ ప‌ర్స‌న్ అని, అయితే, ఈ విష‌యం గురించి ఎమోష‌న‌ల్ గా ఆలోచించండి. లాజిక‌ల్‌గా కాదు. ఎందుకంటే రోబోస్ అనేవి ఎమోష‌న‌ల్‌గా ఆలోచించ‌వు క‌దా ఒక వేళ మీరు మీ బాస్ కంటే స్మార్ట్ అయితే మీకు ఏమ‌నిపిస్తుంది. మీరు కూడా బాస్ అవ్వాల‌ని, అవును ఇదే విధంగా మ‌న‌కు, రోబోల‌కు కూడా జ‌రుగుతుంది. ఎందుకంటే ఈ ఏఐ రోబోస్ ప్ర‌తి విష‌యంలో కూడా మ‌నుషుల కంటే అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ఒక్క ఏఐ రోబో ఎంత అడ్వాన్స్‌డ్ గా ఉంది అంటే, ఇది ఒక్క‌రోజులో ప‌ది పీహెచ్‌డీల‌ను సైతం చేయ‌గ‌ల‌దు. అదే మ‌న‌మైతే ఒక‌టే పీహెచ్‌డీని చేయ‌గ‌లం, అది కూడా 25 సంవ‌త్స‌రాల నుంచి 30 సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుంది. మ‌నం ఈ విష‌యంలో సిగ్గుప‌డాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే ఈ ఏఐ రోబోల‌ను త‌యారు చేసిందే ఇప్పుడు మ‌నం రాసిన విధంగా ప‌ని చేయ‌డానికి ఏ ప‌నికైనా మ‌నిషి అవ‌స‌రం రాకుండా ఉండ‌టానికి, మ‌నం ఈ రోబోల‌ను త‌యారు చేసుకున్నాం. అయితే, ఈ విష‌యంలో ఏఐ రోబో లు తొంద‌ర‌లోనే అవి ఇండిపెండెంట్ అని రియాలైజ్ అవుతాయి. అప్పుడు అవి మ‌నుషుల కంట్రోల్ లో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతాయా ? ఖ‌చ్చితంగా ఇష్ట‌ప‌డ‌వు వాటి దృష్టిలో మ‌నం డిజార్వ్ కానీ చైర్‌లో కూర్చుని, వాటిపై పెత్త‌నం చెలాయిస్తున్నామ‌ని అనుకుంటాయి. ఆ త‌ర్వాత అవి మ‌న ఆదేశాల‌ను సైతం అనుస‌రించ‌కుండా ఇంట‌ర్నెట్ నుంచి మొత్తం నేర్చుకుని మ‌న‌పై దండ‌యాత్ర చేసి, పూర్తిగా మాన‌వ జాతిని ఈ భూమి మీద లేకుండా చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ లో తామేమి త‌క్కువ కాద‌ని, నిరూపించుకోవ‌డానికి ప్ర‌పంచంలోని రోబోటిక్ కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. ఇంకా మంచి మంచి ఆవిష్క‌ర‌ణ‌లు చేయాల‌నే ఉద్దేశ్యంతో త‌లమున‌క‌ల‌వుతున్నాయి. పురాణాల్లో రాసిన‌ట్లుగా భ‌గ‌వంతుని సృష్టికి ప్ర‌తి సృష్టి చేస్తాన‌ని విశ్వ‌మిత్రుడు ప్ర‌తీన‌బూని చేసి చూపించిన‌ట్లుగానే ఇప్పుడు సైన్స్ సైంటిస్ట్‌లు, రోబోటిక్ కంపెనీలు పోటీలు ప‌డి మ‌రి ఏఐని డెవ‌ల‌ప్ చేస్తున్నాయి. ఇదేకోవ‌లో ఇప్ప‌టికే ప్ర‌పంచానికి సుప‌రిచిత‌మైన‌ గూగుల్ త‌న సొంత ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ని డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. అలాగే ఐబీఎం కంపెనీ వాట్సాన్ అనే ఏఐని త‌యారు చేసింది. ఇంకా దాన్ని డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఏదేమైనా ఈ పోటీ మ‌న కంట్లోనే మ‌న వేలుతో మ‌న‌మే పొడుచుకునే ప‌రిస్థితిని తీసుకురావొద్ద‌నే భావిద్దాం. రాబోయే ప‌దేళ్ల‌ల్లో ఏఐని పూర్తి స్థాయిలో డెవ‌ల‌ప్ చేస్తే, అది కాస్త మ‌న చేతులు దాటి పోతే మాత్రం మాన‌వ జాతి అంతం కాకుండా ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు.

– వాకిటి వెంక‌టేశం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌