పొంగులేటి కి మద్దతుగా ముకుమ్మడి రాజీనామా

0
184

మేము సైతం పొంగులేటి వెంటే…..

-జిల్లాలో ఎక్కువ ప్రజా ప్రతినిధులు

– గెలిపించిన ఘనత పొంగులేటిది…

నియోజవర్గ నాయకులు జారే ఆదినారాయణ……

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వరావుపేట నియోజకవర్గం

వార్త లోకం ప్రతినిధి అశ్వరావుపేట నియోజకవర్గం…

దమ్మపేట క్యాంపు కార్యాలయం నందు పొంగులేటి అనుచరులు పొంగులేటి అభిమానులు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ముకుమ్మడి రాజీనామా చేశారు వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీ అంతో ఇంతో బతికి ఉంది అంటే అది పొంగులేటి పుణ్యం అని అన్నారు పొంగులేటి తప్ప జిల్లాలో ఏ నాయకులు మమ్మల్ని పట్టించుకోలేదన్నారు….. పొంగులేటి 2014లో ఒక ప్రాంతీయ పార్టీ అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా మరో ముగ్గురు శాసనసభ్యులను గెలిపించిన ఘనత పొంగులేటిది అన్నారు అయినా ఒక రాష్ట్ర పార్టీ అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాదని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారన్నారు…. ఏమి ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు….పక్క పార్టీలో గెలిచిన ఎంపీ మాత్రమే ఉందన్నారు…. అదేవిధంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గం లో పొంగులేటి అభిమానులు అందరూ బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారన్నారు. తెలంగాణలో ఖమ్మం వేదికగా మరో ఉద్యమం మొదలవుతుందన్నారు… వచ్చే ఎన్నికల్లో పొంగులేటి శ్రీనన్న బ్రాండ్ తో పదికి పది సీట్లు గెలుస్తాం అంటున్నారు….. ఇన్ని రోజులుపార్టీకి సేవలు చేయించుకుని సస్పెండ్ చేయడం దిక్కుమాలిన చర్య అన్నారు… జిల్లాలో ఎక్కువ ప్రజా ప్రతినిధులకు పొంగులేటి శీనన్న మాత్రమే తెలుసు అన్నారు… జిల్లాలో ఏ నాయకుడు జనం మధ్యన లేరన్నారు……