ధోనీనే ప్రపంచ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌

0
721

ఐసీసీ టీ20 (2007), వన్డే (2011) ప్రపంచకప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ (2013)లను ముద్దాడిన భారత వెటరన్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీనే ప్రపంచ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌ అని ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ స్టార్‌ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘ధోనీ గొప్పతనం గురించి చర్చించడం కష్టం. అతడి సారథ్యంలో భారత్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు అద్భుతమైన విజయాలు సాధించాయి. అంచనాలను మోయడం, వాటిని అందుకోవడం మహీకి బాగా తెలుసు’ అని ఎంఎ్‌సను పీటర్సన్‌ ప్రశంసించాడు.