ఇది టీమిండియా ‘మాస్క్‌ ఫోర్స్‌’

0
720

కరోనా వైర్‌సను అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ఫేస్‌ మాస్క్‌ . ఈ విషయంపై అవగాహన పెంచేందుకు టీమిండియా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కొందరు కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఎవరి ఇళ్లలో వారుంటూనే ఈ వీడియోలో పాలుపంచుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని, అలాగే సొంతంగా తయారు చేసుకున్న మాస్క్‌లని వాడండంటూ ఇందులో సందేశం ఇచ్చారు. ‘ఇప్పుడు మనమంతా టీమ్‌ మాస్క్‌ ఫోర్స్‌గా ఏర్పడదాం. ఎవరి మాస్కులు వారే తయారు చేసుకుని ధరిద్దాం’ అంటూ ముందుగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సందేశం ఇవ్వగా ఆ తర్వాత సొంతంగా తయారు చేసుకున్న మాస్క్‌లను ధరిస్తూ సౌరవ్‌ గంగూలీ, స్మృతి మంధాన, రోహిత్‌ శర్మ, హర్భజన్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌, రాహుల్‌ ద్రావిడ్‌, సెహ్వాగ్‌, మిథాలీ రాజ్‌ కనిపించగా ఆఖర్లో సచిన్‌తో ఈ వీడియోను ముగించారు.