వీరులపాడులో భారీగా గుట్కా పట్టివేత

0
992

భారీగా నిషేధిత గుట్కా పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా, వీరులపాడు ప్రతినిధి:-వీరులపాడు మండలం,పెద్దాపురం సరిహద్దు వద్ద ఈరోజు ఉదయం నిషేధిత గుట్కాలను భారీ మొత్తంలో పట్టుబడింది. వీరులపాడు పోలీస్ స్టేషన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో నందిగామ గ్రామీణ సిఐ నాగేంద్ర కుమార్ ఈ విషయాన్నీ వెల్లడించారు. ఈరోజు ఉదయం పెద్దాపురం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,ఎర్రుపాలెం నుంచి విజయవాడ వెళుతున్న టాటా దోస్త్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో భారీ మొత్తం గుట్కా పట్టుబడినట్లు వివరించారు. గుట్కాతో పాటు ఆరు తెలంగాణ మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. పట్టుబడిన గుట్కా విలువ సుమారు పది లక్షల రూపాయలని ఆయన తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యస్సై సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు