స్పీకర్ నిర్భంధం.. బీహార్ అసెంబ్లీలో హైడ్రామా!

0
506

బీహార్ అసెంబ్లీ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. అధికార జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పోలీస్ చట్టాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సభలో గందరగోళం సృష్టించేందుకు సభ్యులు యత్నించారు.

ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ను కార్యాలయంలో విపక్ష సభ్యులు నిర్భంధించారు. అనంతరం కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన మార్షల్ నిరసన తెలుపుతున్న సభ్యులను అసెంబ్లీ కార్యాలయం నుంచి బయటకు పంపించివేశారు. ఈ సందర్భంగా నెలకొన్న తోపులాటలో ఇద్దరు సభ్యులు సొమ్మసిల్లి కిందపడిపోయారు.