`విజ‌య రాఘ‌వ‌న్‌` స‌క్సెస్‌పై విజ‌య్ ఆంటోని కాన్ఫిడెన్స్

0
486

విజ‌య రాఘ‌వ‌న్‌` స‌క్సెస్‌పై హీరో విజ‌య్ ఆంటోని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. లేటెస్ట్‌గా ఈయ‌న ఈయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `విజ‌య్ రాఘ‌వ‌న్‌`. ఆనంద కృష్ణన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వేసవిలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమాలోని `త‌ను చూసి న‌వ్వుకున్న‌…` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా..
హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ – “మా `విజ‌య్ రాఘ‌వ‌న్‌` సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు ప‌క్కా లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. కోవిడ్ త‌ర్వాత సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రిస్తున్నారు. క్రాక్‌, ఉప్పెన‌, జాతిరత్నాలు స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించారు. ఆ చిత్రాల స‌ర‌స‌న మా `విజ‌య రాఘ‌వ‌న్` సినిమా కూడా చేరుతుంద‌ని భావిస్తున్నాను. ద‌ర్శ‌కుడు ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. మద‌ర్ సెంటిమెంట్‌, ప్రేమ‌, రొమాన్స్‌, యాక్ష‌న్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ను ప‌క్కాగా మిక్స్ చేసి సినిమాను రూపొందించాడు. అలాగే బిచ్చ‌గాడు సినిమా నుంచి నాతో అనుబంధం కొన‌సాగిస్తోన్న రైట‌ర్ భాషా శ్రీగారు ఈ సినిమాకు మాట‌లు, పాట‌లు రాశారు. రామ‌చంద్ర‌రాజుగారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం ఆనందంగా ఉంది. చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న‌తో క‌లిసి మ‌రిన్ని సినిమాల‌కు ప‌నిచేయాల‌ని అనుకుంటున్నాను. విజ‌య రాఘ‌వ‌న్ సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను” అన్నారు.