‘డాలర్ స్థానాన్ని బిట్ కాయిన్ ఎన్నటికీ ఆక్రమించలేదు’

0
514

వాషింగ్టన్: ప్రస్తుతం ముదపర్లను అమితంగా ఆకట్టుకుంటున్న క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌పై అమెరికా కేంద్రం బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావేల్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు డాలర్ వంటి ప్రధాన కరెన్సీకి ప్రత్యామ్నాయంగా మారలేవని పేర్కొన్నారు. వాటి విలువలో ఉత్తానపతనాలు ఊహించలేని స్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. ప్రధాన కరెన్సీకి ప్రభుత్వం మద్దతు ఉందని అయితే..క్రిప్టో కరెన్సీ విలువను నిర్దారించే అసెట్స్ ఏవీ లేవని వారు పేర్కొన్నారు. స్పెక్యులేషన్ కొరకే ఉపయోగపతాయని అభిప్రాయపడ్డారు.