ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్వరగా నిర్మించాలి

0
455

వార్తాలోకం ప్రతినిధి చిలకలూరిపేట సెప్టెంబర్ 19 :

చిలకలూరిపేట ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్వరగా నిర్మించాలని మంత్రి విడుదల రజిని గారిని కోరుచున్న గ్రామస్తులు ఎన్నో ఏండ్లు మూలన పడి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానంలో రైతు భరోసా కేంద్రం కట్టినారు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఊరి చివరన స్థలం కేటాయించి రెండు సంవత్సరాలు అయినా పునాదులు వేసి వదిలేసినారు ఇప్పటికైనా తన నియోజకవర్గంలో ఉన్న గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏదైనా చిన్న సమస్య ఉన్న చెప్పుకోవాలంటే డాక్టర్ దగ్గరకి వెళ్లాలంటే చిలకలూరిపేట గాని గుంటూరు గాని వెళ్ళవలసి వస్తుంది అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తొందరగా నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.