ప్రశ్నిద్దాం.. పరిస్థితి మారుద్దం…

0
796

కరోనా వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో వైద్యం అందించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి, ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పరిపాలన పర్యవేక్షణ మీద లేదని తెలిసిపోయింది ప్రస్తుతం మనకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు స్పందించని తరుణంలో స్వీయ నియంత్రణే సరైన మార్గం తప్పనిసరి అయితే మాత్రమే అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రండి

పరిస్థితులను చూస్తున్నాము ఇంతకు ముందే *ఒక జర్నలిస్ట్ వీడియో చూశాను ప్రశ్నించాల్సిన గొంతులు అడుక్కునే స్థాయికి రావడం బాధాకరం* పరిస్థితులను నిజాయితీగా మొదటి నుండి ప్రశ్నిస్తే కొంతలో కొంతైనా మార్పు వచ్చేది తాత్కాలిక మైనటువంటి అవసరాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఇవాళ మీడియా వ్యవహరించింది కాబట్టి ఇలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుంది *మీడియా మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లో కి వెళ్ళాక జర్నలిస్టుల స్వేచ్ఛకు అడ్డంకులు ఉన్నప్పటికీ ఉన్నంతలో నైనా ప్రభుత్వ తీరును ప్రశ్నించాల్సింది* ఇవాళ ఒక బెడ్ కోసం మంత్రిని అభ్యర్థించిన పరిస్థితి ఈ పరిస్థితికి కారణం మనమే కదా ,పరిస్థితులను నిజాయితీగా ప్రశ్నించకుండా ప్రభుత్వమెప్పు కోసం ప్రాకులాడిన ఫలితం ఇది
https://youtu.be/ZLV0vluvujA
మేధావి వర్గం మొదటినుండి చెప్తున్నట్టుగా విద్య ,వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉన్నట్లయితే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకపోయేవి.
కరోన విజృంభిస్తున్న ఈ తరుణంలో డబ్బున్నవారికే వైద్యం అందుతూ పేదవారిని పట్టించుకునే పరిస్థితిలో లేదనేది అనేక సందర్భాల్లో మనకు నిరూపితమైంది *ఇవాళ ప్రజా గాయకుడు నిస్సార్ పాజిటివ్ లక్షణాలతో హాస్పిటల్ కు వెళితే చేర్చుకోలేని పరిస్థితి చివరికి చేర్చుకున్నా వెంటిలేటర్ల కొరత దాని ఫలితంగా ఒక ప్రజా గాయకుడిని కోల్పోయాం* పరిస్థితులను చూస్తే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఏమిటి అని కూడా గ్రహించకుండా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, వైద్యానికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ,ఖర్చు పెట్టకుండా తక్షణ అవసరం కాని వాటిపైన నిధులను కేటాయిస్తూ ప్రజా వైద్యo పైన నిర్లక్ష్యం వహిస్తుందని మనం అర్ధం చేసుకోవాలి

మరో వైపు ప్రభుత్వ అజమాయిషీలో ఉండాల్సిన ప్రైవేటు వైద్యశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవరిస్తూ ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీచేసైనా పట్టించుకునే పరిస్థితిలేదని మనం చూస్తున్నాం *దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా రోగులతో వ్యాపారం చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటుంది ఒక విధంగా చెప్పాలంటే *శవాల మీద పేలాలు ఏరుకునే స్థితిలోకి* ప్రైవేటు వైద్యశాలలు దిగజారాయి సామాజిక బాధ్యత అనేది లేకుండా భారీ వ్యాపారానికి తెరలేపాయి

ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కట్టడి చేయకపోవడం, చూస్తుంటే ఇక ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాల్సిన దుస్థితి లోకి వెళ్ళాం , ప్రతి వాళ్లు కూడా జాగ్రత్తగా కరోనా సమస్యలను అధిగమించి ఆ తదుపరి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఖచ్చితంగా పోరాటం చేసినప్పుడే భవిష్యత్తులోనైనా ఇలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోగలుగుతాం

*విద్య ,వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉంచే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుందాం?

(సీనియర్ జర్నలిస్ట్ శ్రీ చంద్ర)
(source social media)