కొంపముంచుతున్న డి విటమిన్ లోపం

0
709

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రతలో ఏ మార్పు రావడం లేదు. రోజు రోజుకి కరోన కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కరోనా కేసుల్ విషయంలో వైద్య నిపుణులు సంచలన విషయాలు చెప్తున్నారు. డి-విటమిన్‌ లోపం ఉన్నవారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, మృతుల్లోనూ వారే అధికమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా సమృద్ధిగా డి-విటమిన్‌ ఉన్న వారికి కరోనా వచ్చినా.. త్వరగానే కోలుకుంటున్నట్లు తాజాగా ఒక సర్వేలో వెల్లడి అయింది.

ఎక్కువగా సూర్యరశ్మి తగలకుండా ఇండ్లు, కార్యాలయాలకే పరిమితమయ్యే హైదరాబాద్ సహా పలు నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్‌ లోపం ఉంటుందని తాజాగా నిర్వహించిన సర్వేలు చెప్పాయి. హైదరాబాద్ వాసులే కరోనా బారిన ఎక్కువగా పడటానికి ఇదే కారణం అని అంటున్నారు. డి-విటమిన్‌ తక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుందని నిపుణులు చెప్తున్నారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయేది ఎక్కువగా వారే అని వ్యాఖ్యలు చేస్తున్నారు. సమృద్ధిగా ఉన్న వారు మాత్రం కోలుకుని బయటపడుతున్నారు.

విటమిన్‌ డి లోపం శాపంగా మారుతున్నదని హెచ్చరిస్తున్నారు. ఎండలో ఉండాలి అని సూచిస్తున్నారు. ఏసీలు తగ్గిస్తే మంచిది అని హెచ్చరిస్తున్నారు. నగరంలో ప్రతి 100 మందిలో 70 నుంచి 80 మందిలో విటమిన్‌ డి లోపం ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వెల్లడి అయింది. డీ విటమిన్ అనేది సైటోకీన్స్‌ను క్రమ బద్ధ్దీకరిస్తుందని వెల్లడిస్తున్నారు.

సాధారణంగా రోగిలో ఏదైన వైరస్‌ సోకినప్పుడు సైటోకీన్స్‌ అనేవి సైనికుల్లా పనిచేసి శరీరంలోకి వచ్చిన శత్రువుల్లాంటి వైరస్‌లపై దాడిచేసి వాటిని చంపెస్తాయని… కానీ మిటమిన్‌ డి లోపం ఉన్నవారిలో రోగిని వైరస్‌ నుంచి కాపాడాల్సిన ఈ సైటోకీన్సే ఎదురుదాడి చేసి శరీరంలోని ఇతర మూలకణాలను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. వెంటనే ఆ లోపం ఉన్న వాళ్ళు వైద్యులను అడిగి చర్యలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు.