హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

0
230

వార్తాలోకం, ప్రతినిధి, ఘట్కేసర్, సెప్టెంబర్ 28: వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 9వ వార్డులో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు, వార్డు సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 9వ వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి, 10 వ వార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్, 6వ వార్డు కౌన్సిల్ సింగిరెడ్డి సాయిరెడ్డి పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన వారికి కౌన్సిలర్లు దగ్గరుండి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా మెట్టు బాల్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అందరూ అన్ని రంగాల్లో ముందుండాలని ..సంపూర్ణ ఆరోగ్యములతో జీవించాలని ఆ లంబోదరుడిని కోరుకున్నానని చెప్పారు. హనుమాన్ యూత్ కు తనవంతు సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. సర్వ విఘ్నాలు తొలగించి అందరికీ జయము కలిగేలా వినాయకుడి ఆశీర్వాదములు ఉండాలని కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి కోరారు. పనులకు ఆటంకం కలగకుండా వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ తెలిపారు. అన్నిరంగాల్లో ముందుండాలని ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ..ఆదేవుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు డివిజన్ ప్రెసిడెంట్ శ్రీను గౌడ్, విగ్నేష్, బద్రి నాయక్, చలపతి, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ కమల్ వలి, హనుమాన్ యూత్ సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.