గృహలక్ష్మి స్కీమ్ గైడ్ లైన్స్

0
229

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త పథకం గృహలక్ష్మి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు.

l మహిళ పేరు మీదే ఇల్లు సాంక్షన్.
l వైట్ రేషన్ కార్డు, సొంత జాగా ఉంటేనే అర్హులు.
l 2 రూమ్ లు, 1 టాయిలెట్తో నిర్మాణం.
l ఇంటి మీద గృహలక్ష్మి లోగో.
l జీవో 59 ద్వారా లబ్ధి పొందిన వాళ్లు అనర్హులు.
l కలెక్టర్కు అర్హులైన వాళ్లు అప్లికేషన్లు పెట్టుకోవాలి.
l ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్కు లిస్ట్ అందజేయొచ్చు.
l అప్లికేషన్లు ఫైనల్ చేసే బాధ్యత కలెక్టర్దే.
l దశల వారీగా ఇండ్లను మంజూరు చేస్తారు.
l ఇండ్లు రాని వాళ్లు వెయిటింగ్ లిస్ట్ గా పరిగణిస్తారు.
l ఫీల్డ్ ఇన్ స్పెక్షన్స్, బిల్స్ ఫైనల్, బిల్స్ అప్రూవ్, బిల్స్ విడుదల అన్ని కలెక్టర్లు, జీహెచ్ ఎంసీ కమిషనర్ స్టేట్ నోడల్ అకౌంట్ నుంచి లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేస్తారు.
l స్కీమ్ అమలుకు సీజీజీ ద్వారా ప్రత్యేకంగా మొబైల్ యాప్, పోర్టల్.
l ఆన్ లైన్ పోర్టల్ ద్వారానే స్కీమ్ అమలు.
l 3 స్టేజ్ లలో రూ.1లక్ష చొప్పున సహాయం. బేస్మెంట్ లెవల్, స్లాబ్, ఇల్లు పూర్తి.. అన్ని ఫొటోలు అప్ లోడ్ చేయాలి.
l ఈ స్కీమ్ కోసం మహిళ పేరు మీద ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలి. ఇతర ట్రాన్ సాక్షన్స్ కోసం ఈ అకౌంట్ ఉపయోగించరాదు.
l స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ రాష్ట్ర స్థాయిలో స్కీమ్ కు నోడల్ ఆఫీసర్ గా ఉంటారు.