మెక్సికోలో మహిళల ఉగ్రరూపం.. అధ్యక్షుడు దిగిపోవాలని ఆందోళన

0
526

మెక్సికో: సరిగ్గా ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుండగా.. మెక్సికోలో మాత్రం మహిళలు తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాధ్యక్షుడు దిగిపోవాలంటూ ఆందోళనకు దిగారు. ఒక్కసారి పెద్ద సంఖ్యలో మహిళలు రాష్ట్రపతి భవన్‌ను చుట్టుముట్టడంతో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణలో దాదాపు 62 మంది పోలీసులు సహా 81 మంది గాయపడ్డారు.

మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా మెక్సికో అతివలు నడుం బిగించా అతిపెద్ద ప్రదర్శనకు దిగారు. లైంగికదాడికి పాల్పడిన తమ పార్టీ నాయకుడిని దేశాధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ సమర్థించడంతో ఆ దేశ మహిళల్లో కోపం కట్టలు తెంచుకున్నది. అతని వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఓబ్రాడోర్ దేశాధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి భవన్ (నేషనల్ ప్యాలెస్) ను ముట్టడి చేయడానికి మహిళలు పెద్ద సంఖ్యలో ప్రదర్శన వచ్చారు. భద్రతా దళాలను దాటుకుని నేషనల్‌ ప్యాలెస్‌ వైపు వెళ్లేందుకు వారు లైటర్లు, సుత్తులు, చిన్న గ్యాస్ సిలిండర్లను తీసుకువచ్చారు. పోలీసులు వారిని నిలువరించడంతో వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై దాడి చేశారు. కొంతమంది వారికి నిప్పంటించారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ఈ ఘటనలో 62 మంది పోలీసులు సహా 81 మంది మహిళలు గాయపడ్డారు. మహిళలపై అత్యధిక నేరాలు జరుగుతున్న దేశాలలో మెక్సికో ముందుంటుంది. గత ఏడాదిలో రోజుకు సగటున 10 మంది మహిళలు మరణించగా, 16 వేల మంది లైంగికదాడికి గురయ్యారు.

బైడెన్‌కు కొత్త తలనొప్పి
మెక్సికో నుంచి అమెరికాలోకి రావడానికి మెక్సికో వాసులకు తలుపులు తెరువడంతో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ట్రంప్‌ నిర్ణయాలను పక్కనపెట్టిన బైడెన్‌.. మెక్సికో వాసులను అమెరికాలోకి అనుమతించడంతో వేలాది మంది అందుకు సిద్ధమయ్యారు. తొలి విడుతగా 25 వేల మందికి బైడెన్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా ఇంకా వేలాది మంది అమెరికాకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. అమెరికాలోకి వచ్చేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ మధ్య అమెరికా దేశాల నుంచి పారిపోయిన ప్రజల పిల్లలు నిరంతరం అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రెండు వారాల్లో 3,250 మందికి పైగా పిల్లలను పట్టుకుని నిర్బంధ కేంద్రాలకు తరలించారు. జనవరి నెల నుంచి మెక్సికో సరిహద్దు మీదుగా అమెరికాలోకి ప్రవేశించడానికి 78 వేల మంది వలసదారులు ప్రయత్నించారు. ఈ సంఖ్య గత సంవత్సరం ఇదే కాలానికి రెండు రెట్లుగా ఉండేది.