నా కుమార్తెకు ఏం జ‌రిగినా వారిదే బాధ్య‌త: పాక్ మాజీ ప్ర‌ధాని

0
478

ఇస్లామాబాద్‌: త‌న కుమార్తె మ‌రియం న‌వాజ్‌ను పాకిస్థాన్ సైన్యం బెదిరిస్తున్న‌ద‌ని ఓ వీడియో సందే|శంలో ఆ దేశ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ పేర్కొన్నారు. త‌న కూతురికి ఏం జ‌రిగినా.. దానికి ప్ర‌ధాని ఇమ్రాన్‌, ఆర్మీ జ‌న‌ర‌ల్స్ బాధ్య‌త వ‌హించాల్పి ఉంటుంద‌ని ఆయ‌న ఆ వీడియోలో ఆరోపించారు. సైన్యానికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌డం ఆప‌కుంటే.. మ‌రియంను హ‌త‌మారుస్తామంటూ బెదిరింపులు చేస్తున్న‌ట్లు పీఎంఎల్‌-ఎన్ చీఫ్ త‌న సందేశంలో తెలిపారు. మీరు మ‌రీ దిగజారిపోయార‌ని, క‌రాచీలో హోట‌ల్ రూమ్ లో మ‌రియం ఉండ‌గా ఆ రూమ్‌లోకి బ‌ద్ద‌లు కొట్టుకుని వెళ్లార‌ని, దీనికి ఇమ్రాన్ బాధ్య‌త వ‌హించాల‌న్నారు. ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఖామ‌న్ జావెద్ బాజ్వా, ఐఎస్ఐ హెడ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఫ‌యాజ్ హ‌మీద్‌, జ‌న‌ర‌ల్ ఇర్ఫాన్ మాలిక్‌లు కూడా బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. అల్ అజీజా మిల్స్ అవినీతి కేసులో న‌వాజ్ ష‌రీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష ఖ‌రారైంది. అయితే మెడిక‌ల్ గ్రౌండ్స్ పై చికిత్స కోసం లండ‌న్ వెళ్లారు.