కారుపై కూలిన విమానం.. ఇద్ద‌రు మృతి: వీడియో

0
651

పెంబ్రోక్ పైన్స్‌: అమెరికాలోని ఫ్లోరిడాలో విమాన ప్ర‌మాదం జ‌రిగింది. సింగిల్ ఇంజిన్ కూలిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెందారు. సౌత్ ఫ్లోరిడాలోని పెంబ్రోక్ ఫైన్స్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. నార్త్ పెర్రీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేప‌ట్లోనే నేల‌పై కూలింది. అయితే రోడ్డుపై వెళ్తున్న కారును ఆ చిన్న‌పాటి విమానం ఢీకొట్టింది. కారును ఢీకొన్న త‌ర్వాత ఆ విమానం పేలింది. బీచ్‌క్రాఫ్ట్ బొనాంజా ఎయిర్‌క్రాఫ్ట్ కూలిన ఘ‌ట‌న‌పై ఫెడ‌ర‌ల్ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. అయితే ఈ ప్ర‌మాదం ఘ‌ట‌న సీసీటీవీ వీడియోకు చిక్కింది. కింద‌కు కూలుతున్న విమానం.. రోడ్డు మీద వెళ్తున్న కారును ఢీకొట్ట‌డం.. ఆ త‌ర్వాత మంట‌లు వ్యాపించ‌డం.. సీసీటీవీ కెమెరాల్లో క‌నిపించింది.