లెక్చరర్‌గా పవన్ కళ్యాణ్..?

0
593

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెఫ్ఫుడు కొత్త తరహా పాత్రలు చేస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ప్రయోగాలు చేయడంలో పవన్ కళ్యాణ్ ముందుంటాడు. ప్యాంట్ మీద ప్యాంట్ వేసినా, జానీ లాంటి సినిమా తీసినా..’నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్..అయితే ఏంటీ’ అని డైలాగ్ చెప్పినా ఆయన స్టైలే వేరు. అందుకే ఆయన పవర్ స్టార్.పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరసగా ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత 5 ప్రాజెక్ట్స్‌ని ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లలో కూడా పాల్గొంటున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఏ.ఎం.రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 17 శతాబ్ధం కాలం నాటి పీరియాడికల్ సినిమాగా తెరకెక్కుతోంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ లోనూ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. రానా ఈ సినిమాలో మరొక హీరోగా నటిస్తున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం సినిమాకి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ‘హరిహర వీరమల్లు’ సినిమాతో సమాంతరంగా జరుగుతోంది. ఇక ఈరెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 28వ సినిమాగా తెకెక్కబోతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్‌ల కాంబినేషన్ లో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని పవర్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించాడు.