పోచారం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు- మెట్టు బాల్‌రెడ్డి

0
264

 

పోచారం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆహర్నిశలు కృషి
నిరుపేదల ఆశాజ్యోతి – ఘ‌ట్‌కేస‌ర్ కేస‌రి మెట్టు బాల్‌రెడ్డి

వార్తాలోకం ప్రతినిధి – ఘట్‌కేసర్‌, డిసెంబర్‌ 31 :

మెట్టు బాల్ రెడ్డి…ఈ పేరే ఒక ప్రభంజనం. నిఖార్సియాన ప‌ద‌హార‌ణాల తెలంగాణ బిడ్డ… పోచారం అడ్డా… పోచారం 9వ వార్డు ప్రగ‌తికి మెట్టు. సంక్షేమానికి గ‌ట్టు. మాన్య మ‌హానేత కేసీఆర్ స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత‌లూగించిన పోచారం పోరు కెర‌టం…. మెట్టు బాల్‌రెడ్డి. నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపం. రాజకీయంలో తనదైన ముద్ర వేసిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్. సేవా గుణంలో తనకు ఎవరూ సాటిరారు. నిరుపేదలకు సేవ చేసే నిస్వార్థ నాయకుడు. కుల,మతాలకతీతంగా 9వ వార్డులో జనం చేత నీరాజనం అందుకున్న నాయకుడిగా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పవర్‌ ఫుల్ లీడర్.

గ‌రీబోళ్ల ధైర్యం..కడుబీదలకు అండ..

మెట్టు బాల్ రెడ్డి ఈ పేరులోనే త‌గ్గేదెలే అనే వైబ్రేష‌న్ ..ఆర‌డ‌గులు బుల్లెట్‌..పోచారానికి ర‌క్షణ క‌వ‌చంగా నిలిచిన రాకెట్‌. ఆయన చిరు నవ్వులో ఆప్యాయత, ఆత్మీయత ఊగిసలాడుతుంది. మాటంటే మాటే. ఒక్కో మెట్టు అదిగ‌మిండ‌మే త‌ప్ప ఒట్టు తీసి గ‌ట్టున పెట్టే ముచ్చటే ఉండ‌దు. అందుకే మెట్టు బాల‌న్నను తెలంగాణ‌ తెగువకు నిలువుటద్దంలా పిలుస్తారు.నిండైన ఆహర్యం, అలుపేఎరుగ‌ని చిరుదరహాసం..మాట ఇస్తే మడమతిప్పని నైజం. తప్పు చేస్తే ఎంతటివారినైనా.. ఎవరినైనా ఎదురించి ఎదురెళ్లే మొండి ధైర్యం.. సాయం కోరి వచ్చిన వారికి నేనున్నాన‌ని అండగా నిలిచే తత్వం.. అభాగ్యులను అక్కున చేర్చుకుని అభిమానించే స్వరం.. మెట్టు బాల్‌రెడ్డి అంటే పోచారం వాసుల గుండెల్లో అభిమానం అట్లుంట‌ది. బాల‌న్న చెంత‌న వుంటే ఇక ఏ చింతే లేదు.. ప్రతి ఒక్కరి క‌ళ్లలో క‌ద‌లాడే నిజం ఇది.మ‌హానేత కేసీఆర్ స్ఫూర్తిగా నాడు తెలంగాణ ఉద్యమంలో ముందు న‌డిచిన ఘ‌ట్ కేస‌ర్ కేస‌రి. పోచారం దిల్ కా ద‌డ్కన్ మెట్టు బాల్ రెడ్డి..స‌క‌ల జ‌నుల ధైర్యం అత‌ను. కౌన్సెల‌ర్‌గా బంగారు తెలంగాణ బాట‌లో పోచారం 9వ వార్డును ప్రగ‌తి మెట్టుగా మ‌లిచిన విజ‌న‌రీ లీడ‌ర్ ..మెట్టు బాల్ రెడ్డి. ఆయ‌న మ‌న‌సు అద్దంలాంటిది. కౌన్సెల‌ర్‌గా ఆయ‌న చేప‌ట్టిన చేప‌డుతోన్న అభివృద్ధి ,సంక్షేమ కార్యక్ర‌మాల‌కు అద్ధం..పోచారం ప్రగతి ప‌థం.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్పలోని 9వ వార్డు అభివృద్ధిలో దూసుకుపోతుంది.తాగు నీటి నుంటి పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో ముందంజలో ఉంది. నిత్యం ప్రజలలో ఉంటూ జనాధారణ ఉన్న నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 9వ వార్డులో ఏ చిన్న సమస్య ఉన్నా నిమిషాల వ్యవధిలో వచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోతూ ఎవరికీ కష్టాలను దరిదాపుల్లోకి రాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటారు. అందుకే ప్రజలు మెట్టు బాల్ రెడ్డి ని అభిమానిస్తారు. ఆర్తితో అన్నా అంటూ ఆప్యాయంగా పిలుస్తారు.

మెట్టు బాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.

స్వరాష్ర్ట సాధ‌నే ల‌క్ష్యంగా తెలంగాణ పిడికిలెత్తిన స‌మ‌యం. మ‌హానేత కేసీఆర్ పిలుపుతో ఘ‌ట్‌కేస‌ర్‌లో ఓ యువ‌కిషోరం సింహాగ‌ర్జన‌. మెట్టు బాల్‌రెడ్డి నేతృత్వంలో పోచారం అడ్డాగా తెలంగాణ ఉద్యమం ఉర్రూత‌లూగింది. వంటా వార్పు..రాస్తారోకోలో హైవే ద‌ద్దర‌ల్లింది. వ‌ల‌స‌పాల‌కుల వెన్నులో వ‌ణుకు రేపేలా యువ‌నేత‌గా ఉద్యమాన్ని మ‌త్తడి దూకించారు మెట్టు బాల్‌రెడ్డి.స్వ రాష్ట్ర సాధన కోసం నిర్విరామ పోరాటం చేసిన కేసీఆర్ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించారు. సభలు,సమావేశాలల్లో పాల్గొన్నారు. 2001లో ఘట్కేసర్ టిఆర్ఎస్ యువజన అధ్యక్షుడుగా ఐదేండ్లు త‌న మార్క్ చాటారు. ఘట్కేసర్ లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడ్డారు. . యువతకు ఆదర్శంగా నిలుస్తూ రాజకీయాల్లో యువత రావాల్సిన అవసరం ఉందని నిరూపించారు. మెట్టు బాల్ రెడ్డి పోరాటం స్ఫూర్తి, తెగువ, చలాకీతనం, అందరినీ ఆకట్టుకునేలా ప్రసంగం చూసిన సీనియర్ నాయకులతో శభాష్ అనిపించుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఆవశ్యకతను జాతీయ నేతలకు తెలియజేసేందుకు రోడ్డు మార్గంలో ప్రయాణించారు.కేసీఆర్ అడుగులో అడుగు వేస్తూ ఆయన వెంట సుదీర్ఘ ప్రయాణం చేసి దేశం నలుమూలల దిక్కులు పిక్కటిల్లేలా హస్తినలో తెలంగాణ కోసం నినదించారు. అప్పుడే ఘట్కేసర్ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మెట్టు బాల్ రెడ్డి పేరు స్థానికంగా మార్మోగిపోయింది.

సింగపూర్ టౌన్ షిప్ అధ్యక్షుడిగా రెండు సార్లు బాధ్యతలు

మెట్టు బాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. సంస్కృతి టౌన్ షిప్ కు రెండు సార్లు అధ్యక్షుడుగా నియమితులయ్యారు. హరితహారంలో భాగంగా సింగపూర్ టౌన్ షిప్ లో మొక్కలను నాటించి అందంగా సుందరీకరణగా తీర్చిదిద్దారు. టౌన్ షిప్ లోకి అడుగు పెడితే ఆహ్లాదకరంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. టౌన్ షిప్ ను పచ్చని చెట్లతో పచ్చదనం పర్చిన బాల్ రెడ్డి కృషి మరువలేనిది. ఏ చెట్టను అడిగినా బాల్ రెడ్డి పేరే చెబుతుంది. అందుకే చెట్లకు బాల్ రెడ్డికి విడదీయరాని బంధం ఉంది. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేరు స్థానికులు.

9వ వార్డులో ఎదురులేని నాయకుడు

పోచారం మున్సిపాలిటీ 9వ వార్డులో మెట్టు బాల్ రెడ్డి కి ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆయన చేసే మంచి కార్యక్రమాలు వారి మనస్సులో చెరగని ముద్ర వేశాయి. నాయకుడు అంటే ఇలానే ఉండాలని అందరూ అనుకుంటున్నారు. 9వ వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోర్లు వేయించారు. రోడ్లు అయితే అందంగా అద్దంలో మెరిసిపోయేలా తీర్చిదిద్దారు. కరెంట్ సమస్యను తీర్చారు. అండర్ గ్రౌండ్ కరెంట్ వైర్ కరాబ్ అయినా ప్రతిచోటా వాటిస్థానంలో కొత్తది వేయించారు. బిల్డింగ్ లకు కరెంట్ ప్యానల్ బోర్డులను ఏర్పాటు చేయించారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఐదువేల రూపాయలను సాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు. అలాగే 9వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలను చాలా సుందరంగా తీర్చిదిద్దారు. పుస్తకాలు కొనలేని నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇలాంటి మంచి పనులు చేసే నాయకుడే మళ్ళీ కావాలని స్థానికులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని పోచారం ప్రజ‌ల ఆకాంక్ష. అభిమ‌తం. సేవే ల‌క్ష్యంగా సాగుతోన్న మెట్టు బాల్‌రెడ్డి ల‌క్ష్యం పోచారాన్ని బంగారు తెలంగాణ‌కు రోల్ మాడ‌ల్‌గా అభివృద్ధి చేయ‌డం. పోచారం అభివృద్ధి గ‌ట్టుకు తొలి మెట్టు ..మెట్టు బాల‌న్న‌. పోచారం అభివృద్ధి- స‌క‌ల జ‌నుల సంక్షేమం..ఇదే మెట్టుబాల్ రెడ్డి నినాదం-విధానం. మెట్టు బాల‌న్నే మా నాయ‌కుడు.. ఇది పోచారం వాసులు దిల్ సే చెప్పే మాట‌. పోచారం స‌ర్వోతోముఖాభివృద్ధి చెందాలి. ఈ గ‌ట్టున ప్రతీ ఒక్కరూ సుఖ‌సంతోషాల‌తో గ‌డ‌పాలి..అదే నా ల‌క్ష్యం అంటూ పోచారం వాసుల‌కు హృద‌య‌పూర్వంగా నూత‌న సంవ‌త్సర శుభ‌కాంక్షలు తెలిపారు మెట్టు బాల్‌రెడ్డి. కొత్త ఏడాది లో పోచారం కొంగ్రొత్తగా అభివృద్ధి,సంక్షేమ రంగాల్లో మ‌రో మెట్టు ఎద‌గాలే త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు.