సరైన వైద్యం అందక జర్నలిస్టు మనోజ్ మృతి

1
807

గాంధీలో ఆక్సిజన్ పెట్టడం లేదు.. రిపోర్టర్ మనోజ్ ఆఖరి మాటలు
హైదరాబాద్ :
మనోజ్ అనే రిపోర్టర్ కోవిడ్‌తో మరణించారు. ఈ మరణం మీడియాలో కలకలం రేపుతోంది. అయితే చనిపోవడానికి ముందు మనోజ్ చేసిన చాటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆస్పత్రిలో వైద్యులు ఇతర సిబ్బంది కోవిడ్ రోగులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూలో కూడా పరిస్థితులు సరిగా లేవని వాపోయారు. గాంధీ ఆస్పత్రితో దుస్థితిని వీడియోలతో సహా బయటపెట్టారు. గాంధీలో ఆక్సిజన్ పెట్టడం లేదని, తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని కోరతూ తన సన్నిహితులతో చాట్ చేశారు.

Crime Reporter
మనోజ్ చేసిన చాటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మనోజ్ మేసేజ్‌తో గాంధీ ఆస్పత్రిలో ఉన్న డొల్లతనం బహిర్గమైంది. కరోనాతో మృతి చెందిన మనోజ్ వయసు 33 సంవత్సరాలు. శరీరంలోని అన్ని కండరాలను బలహీనం చేసే వ్యాదితో బాధపడేవారు. మనసుకు నచ్చిన యువతిని ఏడు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సతీయణీ గర్భవతి. తొందరలోనే తండ్రిని కాబోతున్నానని కలలు కన్న మనోజ్‌ను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. జూన్ 4న మనోజ్, గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్స చేసినా పరిస్థితి విషమించి మృతి చెందారు.