భారత్‌తో సిరీసులో అలా చేయడం తప్పు.. ఇంగ్లండ్‌‌పై మాజీ కెప్టెన్ కామెంట్స్!

0
517

అహ్మదాబాద్: టెస్టు సిరీసులో భారత్ చేతిలో చిత్తయిన ఇంగ్లండ్ జట్టును ఆ దేశ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తప్పుబట్టాడు. భారత్‌తో టెస్టు సిరీసులో ఇంగ్లండ్ జట్టు రొటేషన్ పద్ధతిలో ఆటగాళ్లను మార్చడం సరైన నిర్ణయం కాదని ఆయన విమర్శించారు. ‘‘ఆటగాళ్ల రొటేషన్ విధానం అనేది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న సరైన నిర్ణయమే. కానీ ఇండియా సిరీసులో అలా చేయడాన్ని సమర్థించలేను. అది సరైన సమయం అని నేను భావించడం లేదు’’ అని నాసిర్ హుస్సేన్ వివరించాడు. ఇలా ఆటగాళ్ల రొటేషన్ కారణంగా భారత్‌తో ఇంగ్లండ్ జట్టు సరిగా పోరాడలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరకంగా ఇదే ఇంగ్లండ్ కొంప ముంచింది అన్నట్లు నాసిర్ హుస్సే చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీనిపై జట్టు మేనేజ్‌మెంట్, ఈసీబీ బోర్డు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.