ఇంతింతై..

0
720

ఆడపిల్లలకు ఆటలెందుకనే మారుమూల పల్లెటూళ్లలో పుట్టి.. మట్టిరోడ్డు తప్ప ట్రాక్‌ అంటే ఏంటో తెలియని మన లేడిపిల్లలు.. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. తమను తక్కువ చేసి చూసినవాళ్ల నోర్లు మూయిస్తున్నారు. పట్టుదల ఉంటే ఆడా, మగ తేడా ఏమీ ఉండదంటున్న ఈ తెలంగాణ చిరుతలు.. తల్లిదండ్రులు కాస్త ధైర్యం చేస్తే చాలు చరిత్ర తిరగరాస్తామని ఢంకా బజాయిస్తున్నారు. ఫెడరేషన్‌ కప్‌ కోసం సిద్ధమవుతున్న అథ్లెట్లు జివాంజి దీప్తి, నందిని, మహేశ్వరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నమస్తే తెలంగాణతో తమ అభిప్రాయాలను పంచుకున్నారిలా..

పోటీ ప్రపంచంలో ఆడా, మగ అనే తేడా ఏమీ లేదు. స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ను చూసి అథ్లెటిక్స్‌ వైపు వచ్చా. అలాగే రేపటి రోజు నన్ను చూసి కూడా చిన్నారులు ఈ రంగంవైపు వస్తే చాలా సంతోషిస్తా.

అమ్మాయిలను తక్కువ చేసి చూడకూడదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే.. ఏదైనా సాధించగలరు. నా బిడ్డ చేయగలదని నమ్మితే చాలు.. మంచి ఫలితాలు వస్తాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడనివ్వండి మహా అయితే విఫలమవుతారు. దానివల్ల పోరాట పటిమ పెరుగుతుంది.

చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది పరుగు ఒక్కటే. మారుమూల గ్రామం నుంచి వచ్చిన నాకు రమేశ్‌ సార్‌ ఎంతో తోడ్పాటునిచ్చారు. ఇటీవల జరిగిన సౌత్‌ జోన్‌ జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో రెండు పతకాలు సాధించా. అంతకుముందు గువాహటిలో జరిగిన నేషనల్‌ మీట్‌లోనూ రెండు రజతాలు నెగ్గా. ప్రస్తుతం ఫెడరేషన్‌ కప్‌ కోసం సిద్ధమవుతున్నా.