నష్టాలతో ముగిసిన సూచీలు!

0
517

అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం 51,660 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన సెన్సెక్స్ 487 పాయింట్లు నష్టపోయింది. ఇక, 15,321 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టిన నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయింది. ఒక దశలో 51,821 పాయింట్ల గరిష్టానికి చేరుకున్న సెన్సెక్స్ అనంతరం ఏకంగా 1283 పాయింట్లు కోల్పోయి 50,538 వద్ద కనిష్టానికి చేరుకుంది. చివరకు తేరుకుని 50,792 పాయింట్ల వద్ద ముగిసింది. బీపీసీఎల్, ఐఓసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడగా, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స నష్టాలను చవిచూశాయి. కరోనా కేసులు పెరుగుతుండడం, మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు వస్తుండడం‌, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటి కారణాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.