ఆ ఆరు రాష్ట్రాల్లోనే 80 శాతం కరోనా కేసులు

0
511

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,476 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, పంజాబ్‌, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే ఉన్నాయని వెల్లడింది. తాజా కేసుల్లో 80.63 శాతం ఈ ఆరు రాష్ట్రాల్లో నమోదయ్యాయని పేర్కొంది. ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడం గత ఐదు నెలల్లో ఇదే మొదటిసారని తెలిపింది.
దేశంలో ఇవాళ 53,476 కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటి కేసుల కన్నా ఇది 13 శాతం అధికమని పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,87,534కు చేరింది. ఇందులో 1,12,31,650 మంది కోలుకున్నారు. మరో 1,60,692 మంది బాధితులు మరణించారు. కాగా, 3,95,192 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌ తర్వాత 53 వేలకుపైగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.