విమానాశ్రయాల లాభాలకు గండి!

0
485

ముంబై: దేశంలో నాలుగు ప్రైవేటు విమానాశ్రయాల నిర్వహణ లాభాలు ఈ ఏడాది 90 శాతం మేరకు పడిపోయే ప్రమాదం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తెలిపింది. వాటిలో హైదరాబాద్‌ విమానాశ్రయంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన ప్రయాణాలు తగ్గడమే ఇందుకు కారణం. దేశంలో ప్రైవేటు విమానాశ్రయాలు తరలించే మొత్తం ప్రయాణికుల సంఖ్యలో 90 శాతం వాటా ఈ నాలుగు విమానాశ్రయాలదే. కాని గత ఏడాది మొత్తం మీద ఈ విమానాశ్రయాలు తరలించిన ప్రయాణికుల సంఖ్య 55 శాతానికి పడిపోయిందని క్రిసిల్‌ నివేదికలో తెలిపింది. విమానయానం ద్వారా వచ్చే ఆదాయాలు 2023 సంవత్సరం నాటికైనా పూర్తి స్థాయిలో పుంజుకోవాలంటే టారి్‌ఫలు 1.3 రెట్లు పెంచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. టారి్‌ఫలు పెంచినట్టైతే వచ్చే ఏడాది చివరికి (2021-22 ఆర్థిక సంవత్సరం) ఈ నాలుగు విమానాశ్రయాల నిర్వహణ లాభాలు కరోనా ముందు కాలం నాటి లాభాల్లో 65 శాతానికి చేరగలవని ఆ సంస్థ తేల్చి చెప్పింది. ఈ నాలుగింటిలో మూడు విమానాశ్రయాలు ఏరోనాటికల్‌ చార్జీలను వర్తమాన స్థాయిల నుంచి రెట్టింపు పైగా పెంచే ఆస్కారం ఉన్నట్టు ఆ నివేదిక అంచనా వేసింది. విమానాశ్రయాల టారిఫ్‌ రెగ్యులేటర్‌ ఏఈఆర్‌ఏ నిర్దిష్ట కాలపరిమితిలో ఏర్పడే నష్టాలను భర్తీ చేసే విధంగా టారి్‌ఫలు పెంచేందుకు విమానాశ్రయాల నిర్వాహకులను అనుమతిస్తుంది. టారి్‌ఫలు ఎంత పరిమాణంలో, ఎప్పుడు పెంచాలి అనేది నిర్ణయించడం ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమని క్రిసిల్‌ తేల్చి చెప్పింది.