భారత్‌పై ఇంగ్లాండ్‌ విజయం

0
598

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఓడింది. ఆల్‌రౌండ్‌ షో కనబరిచిన ఇంగ్లాండ్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్‌ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(83 నాటౌట్‌: 52 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లాండ్‌ 18.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ణు ఛేదించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 2-1తో ఆధిక్యం సాధించింది. జేసన్‌ రాయ్‌(9), డేవిడ్‌ మలన్‌(18) నిరాశపరిచినా బట్లర్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆఖర్లో జానీ బెయిర్‌స్టో(40 నాటౌట్‌: 28 బంతుల్లో 5ఫోర్లు) బట్లర్‌కు సహకారం అందిస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ(77: 46 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో భారత్‌ ఆమాత్రం స్కోరు చేసింది. రోహిత్‌ శర్మ(15), కేఎల్‌ రాహుల్‌(0), ఇషాన్‌ కిషన్‌(4), శ్రేయస్‌ అయ్యర్‌(9) ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ మూడు వికెట్లు తీసి భారత్‌ను భారీ దెబ్బకొట్టాడు. క్రిస్‌ జోర్డాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.