తిరుపతిలో డెల్టా ప్లస్ కొత్త వేరియంట్ కలకలం

0
531

తిరుపతిలో డెల్టా ప్లస్ కొత్త వేరియంట్ ఒక కేసు బయటపడడం ఇప్పుడు భయాందోళనలు కలిగిస్తోంది. తిరుపతి సమీపంలోని మంగళం లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి డెల్టా‌ ప్లస్ వైరస్ కొత్త లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సదరు వ్యక్తి పూర్తిగా డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలు‌ ఉన్నప్పటికీ.. ‌ప్రస్థుతం తగ్గిపోయినట్లు చెబుతున్నారు. ఈ మహమ్మారి మరెవ్వరికీ విస్తరించ లేదని తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే బ్లాక్‌ పంగస్, కరోనా తో తీవ్ర భయాందోళన లో ఉన్న ప్రజలు ఈ కొత్త రకం డెల్టా ప్లస్ వేరియంట్ తో మరింత భయపడుతున్నారు. అయితే తిరుపతి సూపర్నెంట్ భారతీ మాత్రం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి లో వచ్చింది ఒక కేసు మాత్రమే అని ఇప్పుడు కూడా అతనికి పూర్తిగా నయం అయిపోయిందని ప్రస్తుతానికి లో డెల్టా ప్లస్ లక్షణాలు ఉన్న వ్యక్తి హోమ్ ఐషోలేషన్ లో ఉన్నారని చెబుతున్నారు