ఆల్ ఇంగ్లండ్ టోర్నీ.. సెమీస్ లోకి అడుగుపెట్టిన సింధు

0
523

స్టార్ షట్లర్ పీవీ సింధు స్టన్నింగ్ విక్టరీ అందుకుంది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ టోర్నీ క్వార్ట‌ర్స్‌లో పీవీ సింధు సెమీఫైనల్ కి దూసుకెళ్లింది. గత రెండేళ్లుగా పరాజయాలను చవిచూసిన సింధు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ వరల్డ్ టూర్ సూపర్- 1000 లో విజయ పతాకాన్ని ఎగరవేసింది. జపాన్ ప్లేయర్ యమగుచితో క్వార్ట‌ర్ ఫైనల్లో తలపడిన సింధు 16–21, 21–16, 21–19 స్కోర్ తో విజయాన్ని అందుకుంది. ఇంతకుముందు యమగుచితో ఆడిన మూడు ఆటల్లో సింధు పరాజయాన్ని చవిచూసింది. ఇక నాలుగో ఆటలో యమగుచి ని ఓడించి సెమి ఫైనల్స్ కి దూసుకువెళ్లింది. నేడు జరగబోయే సెమీఫైనల్లో థాయిలాండ్ ప్లేయర్ చోచువోంగ్ తో సింధు తలపడనుంది.