విద్య వైద్యం రెండు కళ్ళు -సామినేని ఉదయభాను
పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను వెల్లడించారు. జగ్గయ్యపేట పట్టణం విద్యానగర్ మండవ కాలేజ్ నందు నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో అయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన,వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించిందన్నారు. 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా 4732 మంది తల్లులు గాను 3 కోట్ల 47 లక్షల రూపాయలు వారికి ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు.
ఒక్క విద్యారంగంలోని అమ్మ ఒడి,సంపూర్ణపోషణ, గోరుముద్ద, విద్యాకానుక, మన బడి నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, బైజూస్‌తో ఒప్పందం ఇవి మాత్రమే కాకుండా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా విప్లవాత్మక మార్పులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,కౌన్సిలర్ వట్టేo మనోహర్,వైసిపి నాయకులు వేల్పుల రవి కుమార్,ఆకుల నాని బాజి,ఆవాల భవాని ప్రసాద్,ఖాదర్ బాబు,మరిశెట్టి కోటేశ్వరరావు,శివ, మండవ కాలేజీ ప్రిన్సిపాల్ శ్యామ్,వైస్ ప్రిన్సిపల్ హనుమంతురావు,సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాహుల్ బాబు తదితరులు పాల్గొన్నారు